ఎఱకముడి విశ్వాస మిఁక నేలా
(॥పల్లవి॥)
ఎఱకముడి విశ్వాస మిఁక నేలా
నెఱి నిటమీఁది కీర్తి నీదే కాకా
(॥ఎఱుక॥)
నీవే నే నై యుండఁగాను నిన్ను దూరఁ జో టేది
కావలసినపనులు గనుటే కాకా
ఆవల మారుమాట లడుగఁగఁ జో టేది
వేవేలు సుద్దులెల్ల వినుటే కాకా
(॥ఎఱుక॥)
మనసు లొక్క టైయుండి మచ్చరించఁజో టేది
ననుపున నెందు కైన నగుట గాక
చనవులు గలిగియు సాదించఁ జో టేది
వొనరినసంతసాన నుండుటే కాకా
(॥ఎఱుక॥)
నిండుఁ గాఁగిటనే వుండి నీతోఁ గొంకఁ జో టేది
అండనే మనము వెర గందుట గాకా
కొండల శ్రీవెంకటేశ కూడితిని నన్ను నిట్టె
మెండుగా నిన్నిటా నేను మెచ్చు టింతే కాకా
(||pallavi||)
ĕṟagamuḍi viśhvāsa mim̐ka nelā
nĕṟi niḍamīm̐di kīrdi nīde kāgā
(||ĕṟuga||)
nīve ne nai yuṁḍam̐gānu ninnu dūram̐ jo ṭedi
kāvalasinabanulu ganuḍe kāgā
āvala mārumāḍa laḍugam̐gam̐ jo ṭedi
vevelu suddulĕlla vinuḍe kāgā
(||ĕṟuga||)
manasu lŏkka ṭaiyuṁḍi machchariṁcham̐jo ṭedi
nanubuna nĕṁdu kaina naguḍa gāga
sanavulu galigiyu sādiṁcham̐ jo ṭedi
vŏnarinasaṁtasāna nuṁḍuḍe kāgā
(||ĕṟuga||)
niṁḍum̐ gām̐giḍane vuṁḍi nīdom̐ gŏṁkam̐ jo ṭedi
aṁḍane manamu vĕra gaṁduḍa gāgā
kŏṁḍala śhrīvĕṁkaḍeśha kūḍidini nannu niṭṭĕ
mĕṁḍugā ninniḍā nenu mĕchchu ṭiṁte kāgā