ఎఱగఁ జుమ్మీ యపు డేమీ నేను
(॥పల్లవి॥)
ఎఱగఁ జుమ్మీ యపు డేమీ నేను
మొఱఁగు లన్నిటికిని మొక్కే నేనిపుడు
(॥॥)
నిక్కమును దొరవంటా నిన్నుఁ జూడవచ్చితేను
చిక్కనివలపు నామైఁ జిమ్మి రేఁచితి
నెక్కొని నేఁ గళదాఁకి నీమీఁద నొరగితి
తక్కక నాకాలు చేయి దాఁకదు గదా
(॥॥)
వొంటి నీవున్నాడవంటా వూరికే నే వచ్చితేను
యింటివా రెఱగకుండా నింత సేసితి
జంటనై కాదనలేక సరిగా నేఁగూచుంటి
అంటితిని మందె మేళా లాయనోకదా
(॥॥)
మంచివాఁడవని నీతో మాటలాడ వచ్చితేను
యెంచకే యింతి సేసితి వేరా నీవు
కొంచక శ్రీవేంకటేశ కూడితి మిద్దరమును
ఆంచల నారతుల నీవలసితివో కదా
(||pallavi||)
ĕṟagam̐ jummī yabu ḍemī nenu
mŏṟam̐gu lanniḍigini mŏkke nenibuḍu
(||||)
nikkamunu dŏravaṁṭā ninnum̐ jūḍavachchidenu
sikkanivalabu nāmaim̐ jimmi rem̐sidi
nĕkkŏni nem̐ gaḽadām̐ki nīmīm̐da nŏragidi
takkaga nāgālu seyi dām̐kadu gadā
(||||)
vŏṁṭi nīvunnāḍavaṁṭā vūrige ne vachchidenu
yiṁṭivā rĕṟagaguṁḍā niṁta sesidi
jaṁṭanai kādanalega sarigā nem̐gūsuṁṭi
aṁṭidini maṁdĕ meḽā lāyanogadā
(||||)
maṁchivām̐ḍavani nīdo māḍalāḍa vachchidenu
yĕṁchage yiṁti sesidi verā nīvu
kŏṁchaga śhrīveṁkaḍeśha kūḍidi middaramunu
āṁchala nāradula nīvalasidivo kadā