Erabuladaanamgaanu yemtainaa ne neegunu

ఎరపులదానఁగాను యెంతైనా నే నీకును
Language

(॥పల్లవి॥)
ఎరపులదానఁగాను యెంతైనా నే నీకును
సురతవిద్యలకెల్లా చుట్టమను సుమ్మీ

(॥॥)
సరసములాడి నీచనవు చేకొందుఁగాక
సరికి బేసికి నిన్ను సాదించేనా
విరసాన నీవు నన్ను వెంగెముగాఁ జూడకు
నిరతపు నీ సేఁతకు నే లోనుసుమ్మీ

(॥॥)
ఇచ్చకములాడి నిన్ను యిట్టె దక్కఁగొందుఁగాక
తచ్చనలుసేసి నిన్ను దక్కించేనా
ఇచ్చట సిగ్గుపడకు యేమిటా విచారించకు
మచ్చిక నీమాటకు సమ్మతిదానఁజుమ్మీ

(॥॥)
చేరి నిన్నుఁ గాఁగిలించి సెలవి నవ్వుదుఁగాక
మారుకొని నే నిన్ను మందలించేనా
కూరిమి శ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టె
గారవముతోడి వూడిగపుదానఁజుమ్మీ

(||pallavi||)
ĕrabuladānam̐gānu yĕṁtainā ne nīgunu
suradavidyalagĕllā suṭṭamanu summī

(||||)
sarasamulāḍi nīsanavu segŏṁdum̐gāga
sarigi besigi ninnu sādiṁchenā
virasāna nīvu nannu vĕṁgĕmugām̐ jūḍagu
niradabu nī sem̐tagu ne lonusummī

(||||)
ichchagamulāḍi ninnu yiṭṭĕ dakkam̐gŏṁdum̐gāga
tachchanalusesi ninnu dakkiṁchenā
ichchaḍa siggubaḍagu yemiḍā visāriṁchagu
machchiga nīmāḍagu sammadidānam̐jummī

(||||)
seri ninnum̐ gām̐giliṁchi sĕlavi navvudum̐gāga
mārugŏni ne ninnu maṁdaliṁchenā
kūrimi śhrīveṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
gāravamudoḍi vūḍigabudānam̐jummī