Erabarigamulu nee vela maanevu guttu

ఎరపరికములు నీ వేల మానేవు గుట్టు
Language

(॥పల్లవి॥)
ఎరపరికములు నీ వేల మానేవు గుట్టు
అరసి ఆవల నిన్ను నాడుకొనేనా

(॥ఎర॥)
చేముట్టి ఆపెను నీచేతికి నే నిచ్చితేను
నామోము చూచి నీవు నవ్వ నేఁటికి
యేమి నాయెరుకైతే యేమాయ నీకు నేఁడు
నేమపునీబాసలలో నేర మెంచేనా

(॥ఎర॥)
ఆకె చేత నీకు నే నాకు మడి చిప్పించితే
చేకొని లోలో నీవే సిగ్గు వడేవు
యీకడ నే నీపనికి నింత దగనైతినా
పైకొని నీపనులు నే బయట వేసేనా

(॥ఎర॥)
కందువ మి మ్మిద్దరి నేఁ గాఁగిటఁ బట్టి వొత్తితే
సందు సేసుకొని నన్ను సరిఁగూడేవు
చెంది యీపె వూడిగపుచెలి యింతె యిందు కేమి
నిందలు శ్రీ వేంకటేశ నిన్ను మెపేనా

(||pallavi||)
ĕrabarigamulu nī vela mānevu guṭṭu
arasi āvala ninnu nāḍugŏnenā

(||ĕra||)
semuṭṭi ābĕnu nīsedigi ne nichchidenu
nāmomu sūsi nīvu navva nem̐ṭigi
yemi nāyĕrugaide yemāya nīgu nem̐ḍu
nemabunībāsalalo nera mĕṁchenā

(||ĕra||)
āgĕ seda nīgu ne nāgu maḍi sippiṁchide
segŏni lolo nīve siggu vaḍevu
yīgaḍa ne nībanigi niṁta daganaidinā
paigŏni nībanulu ne bayaḍa vesenā

(||ĕra||)
kaṁduva mi mmiddari nem̐ gām̐giḍam̐ baṭṭi vŏttide
saṁdu sesugŏni nannu sarim̐gūḍevu
sĕṁdi yībĕ vūḍigabusĕli yiṁtĕ yiṁdu kemi
niṁdalu śhrī veṁkaḍeśha ninnu mĕbenā