Erabarigamu limka nedigayya

ఎరపరికము లింక నేటికయ్య
Language

(॥పల్లవి॥)
ఎరపరికము లింక నేటికయ్య
పొరుగు వొంతలనే పొసఁగఁగ వలదా

(॥ఎర॥)
నగవున నీతో ననుపు నటించఁగ
మగువతోఁ బరాకు మానవయ్య
సగముదెగువతో సరసము లాడఁగ
నిగిడి రాజసము నెరపఁగ వలెనా

(॥ఎర॥)
వంతుకు నీపై వలపులు చల్లే
యింతితోడ బిగు విదేలయ్య
మంతనమున నిను మర్మము లంటఁగ
సంతకూటములు జరపఁగ వలెనా

(॥ఎర॥)
చెక్కు నొక్కి పై సేసలు చల్లఁగ
మక్కువ వెఱగులు మానవయ్య
యెక్కువ శ్రీవేంకటేశ కూడితివి
తక్కక రతిఁ జెలిఁ దరమఁగ వలెనా

(||pallavi||)
ĕrabarigamu liṁka neḍigayya
pŏrugu vŏṁtalane pŏsam̐gam̐ga valadā

(||ĕra||)
nagavuna nīdo nanubu naḍiṁcham̐ga
maguvadom̐ barāgu mānavayya
sagamudĕguvado sarasamu lāḍam̐ga
nigiḍi rājasamu nĕrabam̐ga valĕnā

(||ĕra||)
vaṁtugu nībai valabulu salle
yiṁtidoḍa bigu videlayya
maṁtanamuna ninu marmamu laṁṭam̐ga
saṁtagūḍamulu jarabam̐ga valĕnā

(||ĕra||)
sĕkku nŏkki pai sesalu sallam̐ga
makkuva vĕṟagulu mānavayya
yĕkkuva śhrīveṁkaḍeśha kūḍidivi
takkaga radim̐ jĕlim̐ daramam̐ga valĕnā