ఎరపరికపు పొందు లిపుడేఁటికే
(॥పల్లవి॥)
ఎరపరికపు పొందు లిపుడేఁటికే
కరుణ గలప్పుడే కనుపట్టీఁ గాక
(॥ఎర॥)
రాక వుండినవిభుని రమ్మనిపిలువఁ బోతే
కూకులు వత్తులే కాక కూరిమంటీనా
దాకొని తానే వచ్చి తగిలినప్పటివేళ
చౌకలిన్నియును బాసి చవి వుట్టీఁగాక
(॥ఎర॥)
చిత్తము రానివానితో చిట్టకాలు సేయఁబోతే
రిత్తకు రిత్తే కాక రీతి వచ్చీనా
మొత్తమినాతఁడె వచ్చి మోహము సేసినవేళ
బత్తి గలిగి నాతోడఁ బాయకుండీఁగాక
(॥ఎర॥)
వొలసీనొల్లనినాని నొడివట్టి తియ్యఁబోతే
బలవంతములే కాక బాగు వచ్చీనా
అలరి శ్రీవేంకటేశుఁడాతఁడే నన్నుఁగూడె
కలకాలమునునిట్టే కైకొనీఁగాక
(||pallavi||)
ĕrabarigabu pŏṁdu libuḍem̐ṭige
karuṇa galappuḍe kanubaṭṭīm̐ gāga
(||ĕra||)
rāga vuṁḍinavibhuni rammanibiluvam̐ bode
kūgulu vattule kāga kūrimaṁṭīnā
dāgŏni tāne vachchi tagilinappaḍiveḽa
saugalinniyunu bāsi savi vuṭṭīm̐gāga
(||ĕra||)
sittamu rānivānido siṭṭagālu seyam̐bode
rittagu ritte kāga rīdi vachchīnā
mŏttaminādam̐ḍĕ vachchi mohamu sesinaveḽa
batti galigi nādoḍam̐ bāyaguṁḍīm̐gāga
(||ĕra||)
vŏlasīnŏllanināni nŏḍivaṭṭi tiyyam̐bode
balavaṁtamule kāga bāgu vachchīnā
alari śhrīveṁkaḍeśhum̐ḍādam̐ḍe nannum̐gūḍĕ
kalagālamununiṭṭe kaigŏnīm̐gāga