ఎరపరిక మున్నదా యిద్దరిలోన
(॥పల్లవి॥)
ఎరపరిక మున్నదా యిద్దరిలోన
తరుణి పంతము నీ పెద్దరికము గాదా
(॥॥)
పవ్వళించి నీతొడపై నింతి యున్న దంటా
రవ్వలేల సేసేవు రమణులతో
నివ్వటిల్ల నింతగా మన్నించినవాఁడవు నీవె
జవ్వనివేడుకలకు సమ్మతించఁదగదా
(॥॥)
కలికి నీయెదుటను గద్దెమీఁద నెక్కెనంటా
కొలువులో నిటులాడుకొందురా నీవు
చెలఁగి వేడుకచెల్లించినవాఁడ విటు నీవె
చెలిదొరతనము నీసింగారము గాదా
(॥॥)
రతుల నీదేవులు వురముమీఁద మించెనంటా
కతగాఁ జెప్పేవు వూడిగపువారికి
యితవై శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
సతివినోదము నీవు సారె మెచ్చవలదా
(||pallavi||)
ĕrabariga munnadā yiddarilona
taruṇi paṁtamu nī pĕddarigamu gādā
(||||)
pavvaḽiṁchi nīdŏḍabai niṁti yunna daṁṭā
ravvalela sesevu ramaṇulado
nivvaḍilla niṁtagā manniṁchinavām̐ḍavu nīvĕ
javvaniveḍugalagu sammadiṁcham̐dagadā
(||||)
kaligi nīyĕduḍanu gaddĕmīm̐da nĕkkĕnaṁṭā
kŏluvulo niḍulāḍugŏṁdurā nīvu
sĕlam̐gi veḍugasĕlliṁchinavām̐ḍa viḍu nīvĕ
sĕlidŏradanamu nīsiṁgāramu gādā
(||||)
radula nīdevulu vuramumīm̐da miṁchĕnaṁṭā
kadagām̐ jĕppevu vūḍigabuvārigi
yidavai śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
sadivinodamu nīvu sārĕ mĕchchavaladā