Eraa yippudu naa yedudam gadabaraaya

ఏరా యిప్పుడు నా యెదుటఁ గడపరాయ
Language

(॥పల్లవి॥)
ఏరా యిప్పుడు నా యెదుటఁ గడపరాయ
నారీ నేను ని న్నెఱుఁగుదు నను నీ వెఱుఁగుదువు

(॥ఏరా॥)
పలుకులఁ బదరకురా కడుఁ బగటుచెలియ నేను
చెలఁగి యేపనులు మనసునఁ గలిగినఁ జేసి చూపుదువు గాని

(॥ఏరా॥)
తనిసితి నీకతలా మఱి తగవు చెప్ప నేలా
వెనకటివలెనే కద నీబాసలు వింటిఁ గంటి నలనాడే

(॥ఏరా॥)
నగవులఁ బని లేదు యింక నాకుఁ నీకుబోదు
వెగటువాయఁ నను గడపరాయ శ్రీవేంకటగిరిపై గూడితివి

(||pallavi||)
erā yippuḍu nā yĕduḍam̐ gaḍabarāya
nārī nenu ni nnĕṟum̐gudu nanu nī vĕṟum̐guduvu

(||erā||)
palugulam̐ badaragurā kaḍum̐ bagaḍusĕliya nenu
sĕlam̐gi yebanulu manasunam̐ galiginam̐ jesi sūbuduvu gāni

(||erā||)
tanisidi nīgadalā maṟi tagavu sĕppa nelā
vĕnagaḍivalĕne kada nībāsalu viṁṭim̐ gaṁṭi nalanāḍe

(||erā||)
nagavulam̐ bani ledu yiṁka nāgum̐ nīgubodu
vĕgaḍuvāyam̐ nanu gaḍabarāya śhrīveṁkaḍagiribai gūḍidivi