Eraa neevappude nannu nemtagaam joosidivi

ఏరా నీవప్పుడే నన్ను నెంతగాఁ జూచితివి
Language

(॥పల్లవి॥)
ఏరా నీవప్పుడే నన్ను నెంతగాఁ జూచితివి
మేరమీరి నీచేతనే మెప్పించుకో నోపనా

(॥॥)
ఇట్టె నామోహము నీవే యెఱిఁగే వనుంటిఁ గాక
నెట్టన నిన్ను రప్పించనేరనా నేను
చిట్టకానకకు నన్నింత సేయవని వుంటిఁగాక
గట్టిగా నా చేయి మీఁదుగా నడవ నేరనా

(॥॥)
తెమలించి నీవే మాట తీసేవని వుంటిఁగాక
తమిరేఁచి నిన్ను నాఁగ తడవా నాకు
సముఁడవై నవ్వే వింతే సటలని వుంటిఁగాక
రమణులతో నవ్వితే రచ్చవేయలేనా

(॥॥)
ఆసాసల నీమాటకు నడ్డమాడనై తిఁ గాక
వాసి దెచ్చుకుని నిన్ను వంచుకోలేనా
బాసిచ్చి శ్రీ వేంకటేశ పైకొని కూడితిగాక
వేసరినదాఁకా నిన్ను వెంటఁ దిప్పకుందునా

(||pallavi||)
erā nīvappuḍe nannu nĕṁtagām̐ jūsidivi
meramīri nīsedane mĕppiṁchugo nobanā

(||||)
iṭṭĕ nāmohamu nīve yĕṟim̐ge vanuṁṭim̐ gāga
nĕṭṭana ninnu rappiṁchaneranā nenu
siṭṭagānagagu nanniṁta seyavani vuṁṭim̐gāga
gaṭṭigā nā seyi mīm̐dugā naḍava neranā

(||||)
tĕmaliṁchi nīve māḍa tīsevani vuṁṭim̐gāga
tamirem̐si ninnu nām̐ga taḍavā nāgu
samum̐ḍavai navve viṁte saḍalani vuṁṭim̐gāga
ramaṇulado navvide rachchaveyalenā

(||||)
āsāsala nīmāḍagu naḍḍamāḍanai tim̐ gāga
vāsi dĕchchuguni ninnu vaṁchugolenā
bāsichchi śhrī veṁkaḍeśha paigŏni kūḍidigāga
vesarinadām̐kā ninnu vĕṁṭam̐ dippaguṁdunā