Eraa needo padivaadu levva raadugone rimka

ఏరా నీతో పతివాదు లెవ్వ రాడుకొనే రింక
Language

(॥పల్లవి॥)
ఏరా నీతో పతివాదు లెవ్వ రాడుకొనే రింక
నేరుపు నీ వొళ్ళి కల్ల నీవే యెరఁగవా

(॥ఏరా॥)
కల్లలాడి యాన వెట్టి కాదని వాదుకు వచ్చేఁ
వెల్లవారు చూడఁగానే యేరా నీవు
తొల్లి నీవు వెన్నలెల్ల దొంగిలినదొంగవు నీఁ
వెల్లగా మాటలాడిన యిది నిజమా

(॥ఏరా॥)
పంతమాడి పగ చాటి బలిమి నోరు సేసేవు
యింతలోనే నేఁడు నీకు నివి గొతలా
చింతదీర నల్లనాఁడు చీరలదొంగవు నీవు
యెంత నేరవు నీతోడి దిఁక నేఁటిమాఁటలు

(॥ఏరా॥)
కన్నులఁ దప్పక చూచి కాఁతాళించి పెనఁగేమ
యెన్నిటికని నే నీతో నీసడించేనా
మన్నించి శ్రీవేంకటేశ మరి నన్నుఁ గూడితివి
యెన్న రుక్మిణికి దొంగ విఁక నెఁట్టినుల

(||pallavi||)
erā nīdo padivādu lĕvva rāḍugŏne riṁka
nerubu nī vŏḽḽi kalla nīve yĕram̐gavā

(||erā||)
kallalāḍi yāna vĕṭṭi kādani vādugu vachchem̐
vĕllavāru sūḍam̐gāne yerā nīvu
tŏlli nīvu vĕnnalĕlla dŏṁgilinadŏṁgavu nīm̐
vĕllagā māḍalāḍina yidi nijamā

(||erā||)
paṁtamāḍi paga sāḍi balimi noru sesevu
yiṁtalone nem̐ḍu nīgu nivi gŏdalā
siṁtadīra nallanām̐ḍu sīraladŏṁgavu nīvu
yĕṁta neravu nīdoḍi dim̐ka nem̐ṭimām̐ṭalu

(||erā||)
kannulam̐ dappaga sūsi kām̐tāḽiṁchi pĕnam̐gema
yĕnniḍigani ne nīdo nīsaḍiṁchenā
manniṁchi śhrīveṁkaḍeśha mari nannum̐ gūḍidivi
yĕnna rukmiṇigi dŏṁga vim̐ka nĕm̐ṭṭinula