(॥పల్లవి॥)
ఏరా నీ జాణతన మిటువంటిదా
కోరిక చేకొనకుంటే కూళతన మనరా
(॥ఏరా॥)
గందము పూసేచెలిఁ గన్నులనె జంకించేవు
అందులోనే కొనగోరు అంటించె నని
కందువలు సోఁకితేను కళ దాఁకు మేలుగాదా
అంది నీ కితవు సేసినది నేర మాయనా
(॥ఏరా॥)
కొప్పు వెట్టఁగా సతిని గొరబుమాట లాడేవు
చెప్పిరానిసేఁత యేమో సేసె నని
చొప్పు లీపాటి గలితే చుట్టరికాలు మించవా
యిప్పుడు సేసినసేవ లింతదోస మాయనా
(॥ఏరా॥)
పవళించి వున్న నిన్నుఁబ ట్టెత్తితే నవ్వేవు
రవళిఁ జేసినది సురత మని
యవల శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడతివి
జవళి నిద్దరమైతే జయమే కాదా
(||pallavi||)
erā nī jāṇadana miḍuvaṁṭidā
koriga segŏnaguṁṭe kūḽadana manarā
(||erā||)
gaṁdamu pūsesĕlim̐ gannulanĕ jaṁkiṁchevu
aṁdulone kŏnagoru aṁṭiṁchĕ nani
kaṁduvalu som̐kidenu kaḽa dām̐ku melugādā
aṁdi nī kidavu sesinadi nera māyanā
(||erā||)
kŏppu vĕṭṭam̐gā sadini gŏrabumāḍa lāḍevu
sĕppirānisem̐ta yemo sesĕ nani
sŏppu lībāḍi galide suṭṭarigālu miṁchavā
yippuḍu sesinaseva liṁtadosa māyanā
(||erā||)
pavaḽiṁchi vunna ninnum̐ba ṭṭĕttide navvevu
ravaḽim̐ jesinadi surada mani
yavala śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍadivi
javaḽi niddaramaide jayame kādā