Eraa nee guttella ne neṟamganidaa

ఏరా నీ గుట్టెల్ల నే నెఱఁగనిదా
Language

(॥పల్లవి॥)
ఏరా నీ గుట్టెల్ల నే నెఱఁగనిదా
తేరి చూడరాదా మమ్ము తెఱవలలోనను

(॥ఏరా॥)
తోడనే వెలితౌనా నీ దొరతనమునకును
నీడల నావద్ద నిట్టె నిలుచుంటేను
జాడ దప్పీనా నీ జవ్వనమదమునకు
వీడెము నా కందిచ్చితే వెలఁదులలోనను

(॥ఏరా॥)
ఇంచుకంత దరగీనా యిప్పటి నీ సత్తువలో
పంచల నా చెప్పినట్టి పని సేసితే
నించిన నీ చలములో నెరుసులు దొరలీనా
మంచముపైఁ గూచుండి మాఁటలాడితేను

(॥ఏరా॥)
వూరకె నీవు వెట్టిన వొట్టు నీపై మోఁచీనా
యేరా నాకుఁ బంతము లిచ్చితే నీవు
ఆరీతి శ్రీ వేంకటేశ అంతలో నన్నుఁగూడితి
తారుకాణౌనా నాతో తమకించితేను

(||pallavi||)
erā nī guṭṭĕlla ne nĕṟam̐ganidā
teri sūḍarādā mammu tĕṟavalalonanu

(||erā||)
toḍane vĕlidaunā nī dŏradanamunagunu
nīḍala nāvadda niṭṭĕ nilusuṁṭenu
jāḍa dappīnā nī javvanamadamunagu
vīḍĕmu nā kaṁdichchide vĕlam̐dulalonanu

(||erā||)
iṁchugaṁta daragīnā yippaḍi nī sattuvalo
paṁchala nā sĕppinaṭṭi pani seside
niṁchina nī salamulo nĕrusulu dŏralīnā
maṁchamubaim̐ gūsuṁḍi mām̐ṭalāḍidenu

(||erā||)
vūragĕ nīvu vĕṭṭina vŏṭṭu nībai mom̐sīnā
yerā nāgum̐ baṁtamu lichchide nīvu
ārīdi śhrī veṁkaḍeśha aṁtalo nannum̐gūḍidi
tārugāṇaunā nādo tamagiṁchidenu