Eraa nannimtalone yemtagaam joosevu neevu

ఏరా నన్నింతలోనే యెంతగాఁ జూచేవు నీవు
Language

(॥పల్లవి॥)
ఏరా నన్నింతలోనే యెంతగాఁ జూచేవు నీవు
దారతో నీదాననైన తగవరిఁ గాక

(॥ఏరా॥)
సారె నిన్ను సాదించ చలమరిదాననా
వోరిచి నిన్నుఁబొందేటి యోగిణిఁ నేను
కూర వండి కసవేరి గొల్లమంకుదాననా
నేరిచి బతికేననేనీదేవిఁగాక

(॥ఏరా॥)
కన్నుల నిన్ను జంకించేకపటపుదాననా
అన్నిటా నీతలఁపులో యక్షిణి నేను
విన్న కన్నందుకుఁ బట్టే వెఱ్ఱవంటిదాననా
సన్నల నీపని సేసేజవరాలఁగాక

(॥ఏరా॥)
సోలి నిన్ను వేసరించేడుఁబాడుదాననా
లాలించి నిన్నుఁ గూడినలక్ష్మిని నేను
ఆలమాడి పెనఁగ నే నందగారిదాననా
యీలీల శ్రీ వేంకటేశ యింటిదానఁగాక

(||pallavi||)
erā nanniṁtalone yĕṁtagām̐ jūsevu nīvu
dārado nīdānanaina tagavarim̐ gāga

(||erā||)
sārĕ ninnu sādiṁcha salamaridānanā
vorisi ninnum̐bŏṁdeḍi yogiṇim̐ nenu
kūra vaṁḍi kasaveri gŏllamaṁkudānanā
nerisi badigenanenīdevim̐gāga

(||erā||)
kannula ninnu jaṁkiṁchegabaḍabudānanā
anniḍā nīdalam̐pulo yakṣhiṇi nenu
vinna kannaṁdugum̐ baṭṭe vĕṭravaṁṭidānanā
sannala nībani sesejavarālam̐gāga

(||erā||)
soli ninnu vesariṁcheḍum̐bāḍudānanā
lāliṁchi ninnum̐ gūḍinalakṣhmini nenu
ālamāḍi pĕnam̐ga ne naṁdagāridānanā
yīlīla śhrī veṁkaḍeśha yiṁṭidānam̐gāga