ఏరా నన్నణఁకించే వింతే కాక
(॥పల్లవి॥)
ఏరా నన్నణఁకించే వింతే కాక
వేరులేని కూటముల విఱ్ఱవీఁగ వలదా
(॥ఏరా॥)
పిలువఁగానే విచ్చేసి పెనఁగితి వింతే కాక
చెలువుఁడ నీయంత విచ్చేసితివా
వల పిటువంటిదా యెవ్వరికైనాఁ దమకము
తల కెక్కి యెగ్గు సిగ్గు తాము మానవలదా
(॥ఏరా॥)
మొక్కఁగానే నీవు నామోము చూచి తింతె కాక
తక్కక నన్నిందాఁకాఁ దడవితివా
యెక్కువఁ జుట్చరికము లివి దాఁ గన్నదాఁకా
నక్కరతో రెప్పలు మూయక వుండవలదా
(॥ఏరా॥)
కాంగిలించుకోఁగానే కరఁగితి వింతె కాక
రాఁగినరతికి నీవు రమ్మంటినా
వీఁగక శ్రీ వేంకటేశ వేడుక లిట్టులనా
దాఁగక నావెంట నిట్టె తగులఁగ వలదా
(||pallavi||)
erā nannaṇam̐kiṁche viṁte kāga
veruleni kūḍamula viṭravīm̐ga valadā
(||erā||)
piluvam̐gāne vichchesi pĕnam̐gidi viṁte kāga
sĕluvum̐ḍa nīyaṁta vichchesidivā
vala piḍuvaṁṭidā yĕvvarigainām̐ damagamu
tala kĕkki yĕggu siggu tāmu mānavaladā
(||erā||)
mŏkkam̐gāne nīvu nāmomu sūsi tiṁtĕ kāga
takkaga nanniṁdām̐kām̐ daḍavidivā
yĕkkuvam̐ juṭcharigamu livi dām̐ gannadām̐kā
nakkarado rĕppalu mūyaga vuṁḍavaladā
(||erā||)
kāṁgiliṁchugom̐gāne karam̐gidi viṁtĕ kāga
rām̐ginaradigi nīvu rammaṁṭinā
vīm̐gaga śhrī veṁkaḍeśha veḍuga liṭṭulanā
dām̐gaga nāvĕṁṭa niṭṭĕ tagulam̐ga valadā