Eraa naavadda numde yidi dagavaa

ఏరా నావద్ద నుండే యిది దగవా
Language

(॥పల్లవి॥)
ఏరా నావద్ద నుండే యిది దగవా
ఆ రీతిఁ గనీఁ గానమి నది గొంత గాక

(॥ఏరా॥)
కాఁకలు నేయుచు నాపె కన్ను లెదిటికి వచ్చి
సోఁక నిన్ను నవ్వితేనె చొక్కి పడేవు
మూఁకలో నుండి అప్పటి ముసుఁగు వెట్టుక కొమ
రాఁకల నెలయించఁగ నట్టె చూచేవు

(॥ఏరా॥)
మటమాయముల నాపె మాట దీసి నీతోడ
సటులు రెం డాడితేనె చన విచ్చేవు
తటుకున నప్పటిని దగ్గరికివచ్చి యాసె
యెటు నేయు మనినాను యియ్యకొనే విపుడు

(॥ఏరా॥)
సిగ్గుపడ కాపె నిన్ను చేచాఁచి కాఁగిటఁ గూడి
వొగ్గి లోనికిఁ దీసితే వొడఁబడేవు
నిగ్గుల శ్రీవెంకటేశ నీవు న న్నప్పటిఁ గూడి
తగ్గి యాపెచే మొక్కించి తగులు సేసేవూ

(||pallavi||)
erā nāvadda nuṁḍe yidi dagavā
ā rīdim̐ ganīm̐ gānami nadi gŏṁta gāga

(||erā||)
kām̐kalu neyusu nābĕ kannu lĕdiḍigi vachchi
som̐ka ninnu navvidenĕ sŏkki paḍevu
mūm̐kalo nuṁḍi appaḍi musum̐gu vĕṭṭuga kŏma
rām̐kala nĕlayiṁcham̐ga naṭṭĕ sūsevu

(||erā||)
maḍamāyamula nābĕ māḍa dīsi nīdoḍa
saḍulu rĕṁ ḍāḍidenĕ sana vichchevu
taḍuguna nappaḍini daggarigivachchi yāsĕ
yĕḍu neyu maninānu yiyyagŏne vibuḍu

(||erā||)
siggubaḍa kābĕ ninnu sesām̐si kām̐giḍam̐ gūḍi
vŏggi lonigim̐ dīside vŏḍam̐baḍevu
niggula śhrīvĕṁkaḍeśha nīvu na nnappaḍim̐ gūḍi
taggi yābĕse mŏkkiṁchi tagulu sesevū