ఎప్పుడునుఁ దమవార మేడనున్నాను
(॥పల్లవి॥)
ఎప్పుడునుఁ దమవార మేడనున్నాను
తప్పులు వట్టక మమ్ము దయఁ జూడుమనవే
(॥ఎప్పు॥)
పేటలైనగొల్లెతలు పిప్పిసేసి కొసరిన-
నాటివాఁడే కాఁడా తననవ్వు లేఁటివే
పాటించి యెనమండ్రు వట్టపుదేవుళ్లకింది-
మాటువాడు తానాడేమాట లేఁటివే
(॥ఎప్పు॥)
జంగిలి పదారువేలఁ జప్పుచారు సేసినట్టి-
యెంగిలిపొత్తులవాఁడు యేమి చూచీనే
అంగడి గందపుసతి అనుభవించి వేసిన-
సింగారము తానేమి చేయివట్టీనే
(॥ఎప్పు॥)
చయ్యన మధురలోని సతులచన్నుల మీఁది-
పయ్యద తా మమునేల భ్రమఇంచీనే
వొయ్యనే శ్రీవేంకటేశుఁడుద మెక్కించుక నాకు-
నియ్యరానిచన విచ్చె నెదురేడదే
(||pallavi||)
ĕppuḍunum̐ damavāra meḍanunnānu
tappulu vaṭṭaga mammu dayam̐ jūḍumanave
(||ĕppu||)
peḍalainagŏllĕdalu pippisesi kŏsarina-
nāḍivām̐ḍe kām̐ḍā tananavvu lem̐ṭive
pāḍiṁchi yĕnamaṁḍru vaṭṭabudevuḽlagiṁdi-
māḍuvāḍu tānāḍemāḍa lem̐ṭive
(||ĕppu||)
jaṁgili padāruvelam̐ jappusāru sesinaṭṭi-
yĕṁgilibŏttulavām̐ḍu yemi sūsīne
aṁgaḍi gaṁdabusadi anubhaviṁchi vesina-
siṁgāramu tānemi seyivaṭṭīne
(||ĕppu||)
sayyana madhuraloni sadulasannula mīm̐di-
payyada tā mamunela bhrama̮iṁchīne
vŏyyane śhrīveṁkaḍeśhum̐ḍuda mĕkkiṁchuga nāgu-
niyyarānisana vichchĕ nĕdureḍade