ఎప్పుడును వారు వారు నేకము గాక మానరు
(॥పల్లవి॥)
ఎప్పుడును వారు వారు నేకము గాక మానరు
యిప్పటికిఁ దగినట్టు యిచ్చకమె ఆడరే
(॥ఎప్పుడను॥)
కొసరి విభునిఁ దిట్టి కోపగించి మాఁట లాడి
అసురుసు రై యలసి అట్టె పవ్వళించెను
పసగా నారగించదు పగలును యిప్పు డైన
అసము దించఁగ లేపి ఆరగించఁ బెట్టరే
(॥ఎప్పుడును॥)
తానె వొట్టు వెట్టుకొని తరుణి యాతఁ డిచ్చిన
కానుకకప్పుర మెల్ల కడఁ బారఁ జల్లెను
మోనమున దప్పి గొనె ముంచి మీ రైన విడెము
ఆనవెట్టి యిచ్చి యిట్టె ఆకుమడి చియ్యరే
(॥ఎప్పుడును॥)
వోవలనె వేగిరించి వూరకె నిందలు గట్టి
శ్రీవెంకటేశ్వరుఁ జూచి శిగ్గువడి వున్నది
కైవసమై అతఁడె గారవించి చెలిఁ గూడె
యీవల నూడిగములు యేమరక సేయరే
(||pallavi||)
ĕppuḍunu vāru vāru negamu gāga mānaru
yippaḍigim̐ daginaṭṭu yichchagamĕ āḍare
(||ĕppuḍanu||)
kŏsari vibhunim̐ diṭṭi kobagiṁchi mām̐ṭa lāḍi
asurusu rai yalasi aṭṭĕ pavvaḽiṁchĕnu
pasagā nāragiṁchadu pagalunu yippu ḍaina
asamu diṁcham̐ga lebi āragiṁcham̐ bĕṭṭare
(||ĕppuḍunu||)
tānĕ vŏṭṭu vĕṭṭugŏni taruṇi yādam̐ ḍichchina
kānugagappura mĕlla kaḍam̐ bāram̐ jallĕnu
monamuna dappi gŏnĕ muṁchi mī raina viḍĕmu
ānavĕṭṭi yichchi yiṭṭĕ āgumaḍi siyyare
(||ĕppuḍunu||)
vovalanĕ vegiriṁchi vūragĕ niṁdalu gaṭṭi
śhrīvĕṁkaḍeśhvarum̐ jūsi śhigguvaḍi vunnadi
kaivasamai adam̐ḍĕ gāraviṁchi sĕlim̐ gūḍĕ
yīvala nūḍigamulu yemaraga seyare