Eppudunu nee vojalela maanevu

ఎప్పుడును నీ వోజలేల మానేవు
Language

(॥పల్లవి॥)
ఎప్పుడును నీ వోజలేల మానేవు
చిప్పిలు వలపు లింత చిమ్మి రేఁచెఁ గాక

(॥ఎప్పు॥)
చలపాదివాఁడవౌత సారెకు నే నెఱఁగనా
బలుతమకానఁ గొంగువట్టితిఁగాక
పిలిచితే నివెప్పుడు బిగిసేది యెఱఁగనా
పెలుచుఁదమకమునఁ బేరుకిఁగాక

(॥ఎప్పు॥)
మాయదారివాఁడవౌత మలసి నే నెఱఁగనా
నాయము నడపేనంటా నమ్మితిఁగాక
చేయి మీఁద వేసితేనే చిక్కిలోఁగే దెఱఁగనా
ఆయము లంటి సరసమాడితిఁగాక

(॥ఎప్పు॥)
వేడుకకాఁడవా(వౌ?) త వెసనే నెఱఁగనా
పాడితో నే నీకు మొక్కి పై కొంటిగాక
యీడనే శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
జాడ దప్పేవా నేనే జరసితిఁగాక

(||pallavi||)
ĕppuḍunu nī vojalela mānevu
sippilu valabu liṁta simmi rem̐sĕm̐ gāga

(||ĕppu||)
salabādivām̐ḍavauda sārĕgu ne nĕṟam̐ganā
baludamagānam̐ gŏṁguvaṭṭidim̐gāga
piliside nivĕppuḍu bigisedi yĕṟam̐ganā
pĕlusum̐damagamunam̐ berugim̐gāga

(||ĕppu||)
māyadārivām̐ḍavauda malasi ne nĕṟam̐ganā
nāyamu naḍabenaṁṭā nammidim̐gāga
seyi mīm̐da vesidene sikkilom̐ge dĕṟam̐ganā
āyamu laṁṭi sarasamāḍidim̐gāga

(||ĕppu||)
veḍugagām̐ḍavā(vau?) ta vĕsane nĕṟam̐ganā
pāḍido ne nīgu mŏkki pai kŏṁṭigāga
yīḍane śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
jāḍa dappevā nene jarasidim̐gāga