Eppudunu naagu lone(nai?) yeraa krshnaa

ఎప్పుడును నాకు లోనె(నై?) యేరా కృష్ణా
Language

(॥పల్లవి॥)
ఎప్పుడును నాకు లోనె(నై?) యేరా కృష్ణా
చెప్పేవు ప్రియ మప్పుడే చెలువపుఁ గృష్ణా

(॥ఎప్ప॥)
చన్నుల నొరసితిని సాదించేననుచు నిన్ను
వెన్నలేల దొంగిలేవు వేసాలకృష్ణా
కన్నుల జంకించితిని కాఁగిటఁ బట్టేనని
పన్ననేల మాయ లింత బాలకృష్ణా

(॥ఎప్ప॥)
మాటల నిన్నొరసితి మంతనానకు రమ్మని
చాటేవేల సరసాలు జంగిలికృష్ణా
యీటుతోనే నవ్వితిని యిద్దర మొక్కటేయని
వోటమి నీ కెందూ లేదు వున్నతపుకృష్ణా

(॥ఎప్ప॥)
కూడితి కాఁగిట నిన్ను గుఱుతులు నించి నించి
జాడలు దప్పకుమీ జాణకృష్ణా
వీడె మిచ్చితిని శ్రీవేంకటాద్రిపయి నీకు
వాడికలు మనసొమ్ము వన్నెల వోకృష్ణా

(||pallavi||)
ĕppuḍunu nāgu lonĕ(nai?) yerā kṛṣhṇā
sĕppevu priya mappuḍe sĕluvabum̐ gṛṣhṇā

(||ĕppa||)
sannula nŏrasidini sādiṁchenanusu ninnu
vĕnnalela dŏṁgilevu vesālakṛṣhṇā
kannula jaṁkiṁchidini kām̐giḍam̐ baṭṭenani
pannanela māya liṁta bālakṛṣhṇā

(||ĕppa||)
māḍala ninnŏrasidi maṁtanānagu rammani
sāḍevela sarasālu jaṁgilikṛṣhṇā
yīḍudone navvidini yiddara mŏkkaḍeyani
voḍami nī kĕṁdū ledu vunnadabukṛṣhṇā

(||ĕppa||)
kūḍidi kām̐giḍa ninnu guṟudulu niṁchi niṁchi
jāḍalu dappagumī jāṇakṛṣhṇā
vīḍĕ michchidini śhrīveṁkaḍādribayi nīgu
vāḍigalu manasŏmmu vannĕla vokṛṣhṇā