ఎప్పుడుఁగల సాజమె యిన్నియు మాకు
(॥పల్లవి॥)
ఎప్పుడుఁగల సాజమె యిన్నియు మాకు
కప్పి యిందుకుఁగా నెంత కాచుకుందువయ్యా
(॥ఎప॥)
మబ్బులైన చూపులూ మంకుల రాజసములు
గబ్బి గబ్బి మాటలు కలవే మాకు
నిబ్బరపు దొరవూ నేరుపరివన్నిటాను
అబ్బురపడుతానేల ఆసపడేవయ్యా
(॥ఎప॥)
గుట్టుతోడి సిగ్గుల కొసరుల మేకులు
గట్టి గట్టి చన్నులూ కలవే మాకు
ఱట్టడివి మిగులాను ఱాతిగుండె వాఁడవు
పట్టి పట్టి చూచి యేల బ్రమసేవయ్యా
(॥ఎప॥)
బొమ్మల జంకెనలూ పొల్లుల మందెమేలాలు
కమ్మి కమ్మి సింగారాలు కలవేమాకు
దిమ్మరి శ్రీ వేంకటేశ దిష్టమై మమ్మేలితివి
పమ్ముచు నింకానేమి బాఁతిపడేవయ్యా
(||pallavi||)
ĕppuḍum̐gala sājamĕ yinniyu māgu
kappi yiṁdugum̐gā nĕṁta kāsuguṁduvayyā
(||ĕba||)
mabbulaina sūbulū maṁkula rājasamulu
gabbi gabbi māḍalu kalave māgu
nibbarabu dŏravū nerubarivanniḍānu
abburabaḍudānela āsabaḍevayyā
(||ĕba||)
guṭṭudoḍi siggula kŏsarula megulu
gaṭṭi gaṭṭi sannulū kalave māgu
ṟaṭṭaḍivi migulānu ṟādiguṁḍĕ vām̐ḍavu
paṭṭi paṭṭi sūsi yela bramasevayyā
(||ĕba||)
bŏmmala jaṁkĕnalū pŏllula maṁdĕmelālu
kammi kammi siṁgārālu kalavemāgu
dimmari śhrī veṁkaḍeśha diṣhṭamai mammelidivi
pammusu niṁkānemi bām̐tibaḍevayyā