Eppudu vattuvoyamtaa yedurusoosee neegum

ఎప్పుడు వత్తువోయంటా యెదురుచూచీ నీకుఁ
Language

(॥పల్లవి॥)
ఎప్పుడు వత్తువోయంటా యెదురుచూచీ నీకుఁ
గప్పురమిచ్చేనంటాఁ గాచుకున్నాఁ డతఁడు

(॥ఎప॥)
మక్కువైనపతితోడ మాటలాడుకొనవమ్మ
వుక్కుమీరి యేకతాన నున్నవాఁడు
పక్కనఁ జిత్తమురాను పాదా లోత్తఁగదవమ్మ
పిక్కటిల్లి సిగ్గులేల పెంచేవు నీవు

(॥ఎప॥)
వసమై నీనేరుపుల వలపించుకొనవమ్మ
వెస నీవు వచ్చువంటా వేళైవున్నాఁడు
కోసరి దండఁగూచుండి గుబ్బల నొత్తఁగదమ్మ
ముసిముసినవ్వులేల ముంచేవు సెలవుల

(॥ఎప॥)
నీవల మేలుమంగవు నేఁడు మెప్పించుకోవమ్మ
శ్రీవేంకటేశుఁడు నీపై చింతనున్నాఁడు
దేవుల వైతి వింకఁ దెరదియ్యఁగదవమ్మ
పువ్వుల సేసల నెంతపొద్దు జరపేవు

(||pallavi||)
ĕppuḍu vattuvoyaṁṭā yĕdurusūsī nīgum̐
gappuramichchenaṁṭām̐ gāsugunnām̐ ḍadam̐ḍu

(||ĕba||)
makkuvainabadidoḍa māḍalāḍugŏnavamma
vukkumīri yegadāna nunnavām̐ḍu
pakkanam̐ jittamurānu pādā lottam̐gadavamma
pikkaḍilli siggulela pĕṁchevu nīvu

(||ĕba||)
vasamai nīnerubula valabiṁchugŏnavamma
vĕsa nīvu vachchuvaṁṭā veḽaivunnām̐ḍu
kosari daṁḍam̐gūsuṁḍi gubbala nŏttam̐gadamma
musimusinavvulela muṁchevu sĕlavula

(||ĕba||)
nīvala melumaṁgavu nem̐ḍu mĕppiṁchugovamma
śhrīveṁkaḍeśhum̐ḍu nībai siṁtanunnām̐ḍu
devula vaidi viṁkam̐ dĕradiyyam̐gadavamma
puvvula sesala nĕṁtabŏddu jarabevu