ఎప్పుడు వత్తువోయంటా యెదురుచూచె నీకు
(॥పల్లవి॥)
ఎప్పుడు వత్తువోయంటా యెదురుచూచె నీకు
కప్పరవిడెము గక్కన నియ్యవయ్యా
(॥॥)
బయలుపందిలివెట్టె పడఁతి నెన్నడు మను
ప్రియమున నీపై సేసపెట్టే నంటాను
నయమునఁ బచ్చతోరణము గట్టెఁ గరముల
రయమున నింటి కిట్టె రావయ్య నీవు
(॥॥)
పొందైనకుచములనుబూజగుండలు దెచ్చె
అందముగఁ గాగిలించేనంటా నిన్ను
విందాయితము సేసె వేడుకఁ దనమోవిని
కుందణఁపు మంచముపైఁ గూచుండవయ్యా
(॥॥)
తోరపుఁబెండ్లిపీఁటగా తొడలనే పొసఁగించె
ఆరసి రతి కాయితమంటాను నీకు
చేరి కూడితి వీకెను శ్రీవేంకటేశుఁడ నేడు
గారవించవయ్య ఇఁక గనముగా నీవు
(||pallavi||)
ĕppuḍu vattuvoyaṁṭā yĕdurusūsĕ nīgu
kapparaviḍĕmu gakkana niyyavayyā
(||||)
bayalubaṁdilivĕṭṭĕ paḍam̐ti nĕnnaḍu manu
priyamuna nībai sesabĕṭṭe naṁṭānu
nayamunam̐ bachchadoraṇamu gaṭṭĕm̐ garamula
rayamuna niṁṭi kiṭṭĕ rāvayya nīvu
(||||)
pŏṁdainagusamulanubūjaguṁḍalu dĕchchĕ
aṁdamugam̐ gāgiliṁchenaṁṭā ninnu
viṁdāyidamu sesĕ veḍugam̐ danamovini
kuṁdaṇam̐pu maṁchamubaim̐ gūsuṁḍavayyā
(||||)
torabum̐bĕṁḍlibīm̐ṭagā tŏḍalane pŏsam̐giṁchĕ
ārasi radi kāyidamaṁṭānu nīgu
seri kūḍidi vīgĕnu śhrīveṁkaḍeśhum̐ḍa neḍu
gāraviṁchavayya im̐ka ganamugā nīvu