ఎప్పుడు చిత్తగించేవో యేగతి మన్నించేవో
(॥పల్లవి॥)
ఎప్పుడు చిత్తగించేవో యేగతి మన్నించేవో
వొప్పన సేసితి నుడివోని వయసు
(॥॥)
పంతమాడి వలచితి పైకొని నే నీకు
సంతోసానఁ బొగడితి సారెకు నిన్ను
చింతదీర మొక్కితి చెలగఁ నీపాదాలపై
ఇంతకంటే మరి నే నేమి సేతు నిఁకను
(॥॥)
సన్నలనే చవిగొంటి సరసపునీమోవి
కన్నుల ను సొలసితి గక్కన నిన్ను
చన్నుమొనల నొత్తితి సంగడికి వచ్చి నీమై
యెన్నికలు నెరవేరె నేమిసేతు నిఁకను
(॥॥)
విరుల సేస వెట్టితి వేడుక నీకొప్పుమీఁ ద
నిరతిమైఁ గాఁగిట నించితి నిన్ను
సిరుల నన్నేలితివి శ్రీవేంకటేశ్వర
యిరువైతి నూడిగాన కేమిసేతు నిఁకను
(||pallavi||)
ĕppuḍu sittagiṁchevo yegadi manniṁchevo
vŏppana sesidi nuḍivoni vayasu
(||||)
paṁtamāḍi valasidi paigŏni ne nīgu
saṁtosānam̐ bŏgaḍidi sārĕgu ninnu
siṁtadīra mŏkkidi sĕlagam̐ nībādālabai
iṁtagaṁṭe mari ne nemi sedu nim̐kanu
(||||)
sannalane savigŏṁṭi sarasabunīmovi
kannula nu sŏlasidi gakkana ninnu
sannumŏnala nŏttidi saṁgaḍigi vachchi nīmai
yĕnnigalu nĕraverĕ nemisedu nim̐kanu
(||||)
virula sesa vĕṭṭidi veḍuga nīgŏppumīm̐ da
niradimaim̐ gām̐giḍa niṁchidi ninnu
sirula nannelidivi śhrīveṁkaḍeśhvara
yiruvaidi nūḍigāna kemisedu nim̐kanu