ఎప్పుడు నీయిచ్చలోని యింతిఁ గాక
(॥పల్లవి॥)
ఎప్పుడు నీయిచ్చలోని యింతిఁ గాక
తప్పులు నీమీఁద వేసే తరుణినా నేను
(॥ఎప్పుడు॥)
వంతులకు వాసులకు వలపులు చల్లి చల్లి
అంత నిన్ను దూరేటియాఁటదాననా
కొంత నిన్నుఁ గోపగించి గొణఁగి గొణఁగి తిట్టి
పంతము వెనక నిచ్చే పడఁతినా నేను
(॥ఎప్పుఢు॥)
పొద్దు వొద్దు నీవద్ది పొలఁతులవలెనే
అద్దలించి పెనఁగేటి యాఁటదాననా
ఉద్దండాలు నీతోఁ జేసి పూరకే వెనకు వచ్చి
తిద్దుకొని మాట లాడేదేవులనా నేను
(॥ఎప్పుడు॥)
గారవాన నిన్నుఁ గూడి కాఁగిటి నీచేఁత లెల్ల
ఆరయ జెప్పుకొనేటి యాఁటదాననా
నేరుతువు శ్రీవెంకటనిలయ నీయాల నైతి
సారెకు సారె మాటాడేసకియనా నేనూ
(||pallavi||)
ĕppuḍu nīyichchaloni yiṁtim̐ gāga
tappulu nīmīm̐da vese taruṇinā nenu
(||ĕppuḍu||)
vaṁtulagu vāsulagu valabulu salli salli
aṁta ninnu dūreḍiyām̐ṭadānanā
kŏṁta ninnum̐ gobagiṁchi gŏṇam̐gi gŏṇam̐gi tiṭṭi
paṁtamu vĕnaga nichche paḍam̐tinā nenu
(||ĕppuḍhu||)
pŏddu vŏddu nīvaddi pŏlam̐tulavalĕne
addaliṁchi pĕnam̐geḍi yām̐ṭadānanā
uddaṁḍālu nīdom̐ jesi pūrage vĕnagu vachchi
tiddugŏni māḍa lāḍedevulanā nenu
(||ĕppuḍu||)
gāravāna ninnum̐ gūḍi kām̐giḍi nīsem̐ta lĕlla
āraya jĕppugŏneḍi yām̐ṭadānanā
neruduvu śhrīvĕṁkaḍanilaya nīyāla naidi
sārĕgu sārĕ māḍāḍesagiyanā nenū