ఎప్పుడు నీవారమే యేడనుండినా
(॥పల్లవి॥)
ఎప్పుడు నీవారమే యేడనుండినా
నెప్పునఁ గట్టిన పుస్తె నీకుఁగానే కాదా
(॥ఎప్పు॥)
పిప్పిగట్ట నేవేల ప్రియములు చెప్పేవు
అప్పుడే నే జెప్పెంపనా ఆకెతోను
చిప్పిల నీవంతయేల చేయివట్టి పెనఁగేవు
చప్పనాయ వలపులు చాలునని యననా
(॥ఎప్పు॥)
జిడ్డుదేర నీవేల చేతులు పైఁజాఁచేవు
గడ్డెము వొద్దని నీకుఁ గమ్మ లంపనా
వొడ్డుకోఁగా నీవేల వూరకే కాఁగిలించేవు
జడ్డుపడెఁ దమకము సటలేఁటికననా
(॥ఎప్పు॥)
పచ్చిగా నీవింత యేల పైపై నన్నుఁ గూడితివి
కచ్చుపెట్టి వుంకువ వుంగర మంపనా
మెచ్చి శ్రీవేంకటేశుఁడ మీరి నన్నుఁ బొగడేవు
విచ్చనవిడాయ నీకు వెఱపేఁటికననా
(||pallavi||)
ĕppuḍu nīvārame yeḍanuṁḍinā
nĕppunam̐ gaṭṭina pustĕ nīgum̐gāne kādā
(||ĕppu||)
pippigaṭṭa nevela priyamulu sĕppevu
appuḍe ne jĕppĕṁpanā āgĕdonu
sippila nīvaṁtayela seyivaṭṭi pĕnam̐gevu
sappanāya valabulu sālunani yananā
(||ĕppu||)
jiḍḍudera nīvela sedulu paim̐jām̐sevu
gaḍḍĕmu vŏddani nīgum̐ gamma laṁpanā
vŏḍḍugom̐gā nīvela vūrage kām̐giliṁchevu
jaḍḍubaḍĕm̐ damagamu saḍalem̐ṭigananā
(||ĕppu||)
pachchigā nīviṁta yela paibai nannum̐ gūḍidivi
kachchubĕṭṭi vuṁkuva vuṁgara maṁpanā
mĕchchi śhrīveṁkaḍeśhum̐ḍa mīri nannum̐ bŏgaḍevu
vichchanaviḍāya nīgu vĕṟabem̐ṭigananā