ఎప్పుడు నీకే పోదు యిట్లు భారము మోప
(॥పల్లవి॥)
ఎప్పుడు నీకే పోదు యిట్లు భారము మోప-
నప్పుడే నా సవతుల నణఁచఁగ వలదా
(॥ఎప్పు॥)
చాయల నీవు ముట్టి సతిఁ దలఁచితి వీడ
పోయినపోరు లట్టె పోనీ రాదా
ఆయాలు సోఁకేపనుల కస మిచ్చితివి నాకు
పాయక నా కిఁక వెనుబలమై రావలదా
(॥ఎప్పు॥)
కందువ మాటలాడి కలవరించితి వీడ
అందము మావినపను లవి యేల
నింద నే వొక టాడఁగ నీ వొరటి ఆడఁగాను
యిందువంక నేమి వచ్చె నేలుకొనవలదా
(॥ఎప్పు॥)
కపటము లెల్లఁ దీర కాఁగిలించుకొంటి వీడ
రసముగ నిట్టె నన్ను రక్షించరాదా
ఇపుడె శ్రీ వేంకటేశ యిద్దర మొక్క టైతిమి
వుపమించి యెక చిత్త మొనరించవలదా
(||pallavi||)
ĕppuḍu nīge podu yiṭlu bhāramu moba-
nappuḍe nā savadula naṇam̐sam̐ga valadā
(||ĕppu||)
sāyala nīvu muṭṭi sadim̐ dalam̐sidi vīḍa
poyinaboru laṭṭĕ ponī rādā
āyālu som̐kebanula kasa michchidivi nāgu
pāyaga nā kim̐ka vĕnubalamai rāvaladā
(||ĕppu||)
kaṁduva māḍalāḍi kalavariṁchidi vīḍa
aṁdamu māvinabanu lavi yela
niṁda ne vŏga ṭāḍam̐ga nī vŏraḍi āḍam̐gānu
yiṁduvaṁka nemi vachchĕ nelugŏnavaladā
(||ĕppu||)
kabaḍamu lĕllam̐ dīra kām̐giliṁchugŏṁṭi vīḍa
rasamuga niṭṭĕ nannu rakṣhiṁcharādā
ibuḍĕ śhrī veṁkaḍeśha yiddara mŏkka ṭaidimi
vubamiṁchi yĕga sitta mŏnariṁchavaladā