ఎప్పుడు నీదాననే యిన్నిటా నీచిత్తము
(॥పల్లవి॥)
ఎప్పుడు నీదాననే యిన్నిటా నీచిత్తము
చప్పుడు సేయుటేకాని సాదించనేరను
(॥ఎప్పుడు॥)
చూపులకు లోనై సుద్దులకు వెలియై
నీపొందు సేసేను నిచ్చలు నేను
తీపులనే పిలుపులు తిట్లనే బులుపులు
మోపుగట్టివేసే నీపై మొరఁగనేరను
(॥ఎప్పుడు॥)
పలుకులకు గురై పంతానకు మరఁగై
వలపులు చల్లేను వాసికే నేను
సెలవుల నవ్వులును చేతులనే పువ్వులును
నిలువున వేసేను నెపాలు నే నేరను
(॥ఎప్పుడు॥)
తమకములకుఁ జిక్కి తలపోఁతలకుఁ జొక్కి
సమముగాఁ గూడేను సారెకు నేను
అమరె శ్రీవేంకటేశ అంకెలును-లంకెలును
జమళి నీపై వేసేను సటలు నే నేరను
(||pallavi||)
ĕppuḍu nīdānane yinniḍā nīsittamu
sappuḍu seyuḍegāni sādiṁchaneranu
(||ĕppuḍu||)
sūbulagu lonai suddulagu vĕliyai
nībŏṁdu sesenu nichchalu nenu
tībulane pilubulu tiṭlane bulubulu
mobugaṭṭivese nībai mŏram̐ganeranu
(||ĕppuḍu||)
palugulagu gurai paṁtānagu maram̐gai
valabulu sallenu vāsige nenu
sĕlavula navvulunu sedulane puvvulunu
niluvuna vesenu nĕbālu ne neranu
(||ĕppuḍu||)
tamagamulagum̐ jikki talabom̐talagum̐ jŏkki
samamugām̐ gūḍenu sārĕgu nenu
amarĕ śhrīveṁkaḍeśha aṁkĕlunu-laṁkĕlunu
jamaḽi nībai vesenu saḍalu ne neranu