Eppudu nee volabakshaalela maanevu

ఎప్పుడు నీ వొలపక్షాలేల మానేవు
Language

(॥పల్లవి॥)
ఎప్పుడు నీ వొలపక్షాలేల మానేవు
దప్పి వలపుల నేనే తగిలేఁ గాన

(॥ఎప్పు॥)
కాయము నీపై వేసి కన్నులు దేలించితేను
ఆయడనే బ్రమసితివాపెకు నీవు
చేయి పట్టుక నేనెంత చెక్కు నిన్ను నొక్కినాను
చాయకు రావెప్పుడు నీసటలే కానీ

(॥ఎప॥)
వేసాలకు మాటలాడి వెడనవ్వు నవ్వితేను
ఆసల వెంటఁ దిరిగేవాపెకు నీవు
వాసికిఁ జన్నులు మోపి వద్దనెంత గూచుండిన
రాసికెక్కదీవలపు రవ్వే కాన

(॥ఎప॥)
యిట్టునట్టు కొంగు వట్టి యింటిలోనికిఁ దీసితేను
అట్టే లోనైతివి ఆపెకు నీవు
నెట్టన శ్రీవేంకటేశ నిన్ను నేఁగూడితినిదె
వొట్టి నీతనివి దీరదుడుగుటే కానీ

(||pallavi||)
ĕppuḍu nī vŏlabakṣhālela mānevu
dappi valabula nene tagilem̐ gāna

(||ĕppu||)
kāyamu nībai vesi kannulu deliṁchidenu
āyaḍane bramasidivābĕgu nīvu
seyi paṭṭuga nenĕṁta sĕkku ninnu nŏkkinānu
sāyagu rāvĕppuḍu nīsaḍale kānī

(||ĕba||)
vesālagu māḍalāḍi vĕḍanavvu navvidenu
āsala vĕṁṭam̐ dirigevābĕgu nīvu
vāsigim̐ jannulu mobi vaddanĕṁta gūsuṁḍina
rāsigĕkkadīvalabu ravve kāna

(||ĕba||)
yiṭṭunaṭṭu kŏṁgu vaṭṭi yiṁṭilonigim̐ dīsidenu
aṭṭe lonaidivi ābĕgu nīvu
nĕṭṭana śhrīveṁkaḍeśha ninnu nem̐gūḍidinidĕ
vŏṭṭi nīdanivi dīraduḍuguḍe kānī