Eppudu nee voja livi yela maanevu

ఎప్పుడు నీ వోజ లివి యేల మానేవు
Language

(॥పల్లవి॥)
ఎప్పుడు నీ వోజ లివి యేల మానేవు
ముప్పిరి నీ చేఁత లిట్టే మూసి దాఁచవలెనా

(॥ఎప్పు॥)
చేయి మాటు సేసుక యాచెలి దిక్కే చూచేవు
యీయెడఁ గొలువుకాంత లిందరిలోన
ఆయాలు దాఁక సందడి నాకెపాదాలే తొక్కేవు
మాయకాఁడ ఇంతేసి నీమతక మెరఁగమా

(॥ఎప్పు॥)
అద్దలించేవానివలె నాపెతోనే పలికేవు
వొద్దికై నసతులెల్ల వొద్ద నుండఁగా
బద్దుల బడలికతోఁ బట్టే వాపెకైదండ
కద్దులేరా నీవొళ్ళికపటా లెరఁగనా

(॥ఎప్పు॥)
యెగసక్కీనివలెనే యీపెతోనే నవ్వేవు
సొగసి తోడిసతులు చూడఁగానే
అగపడి కూడితివి అలమేలుమంగ నేను
తగు శ్రీవేంకటేశ నీ తమక మెరఁగనా

(||pallavi||)
ĕppuḍu nī voja livi yela mānevu
muppiri nī sem̐ta liṭṭe mūsi dām̐savalĕnā

(||ĕppu||)
seyi māḍu sesuga yāsĕli dikke sūsevu
yīyĕḍam̐ gŏluvugāṁta liṁdarilona
āyālu dām̐ka saṁdaḍi nāgĕbādāle tŏkkevu
māyagām̐ḍa iṁtesi nīmadaga mĕram̐gamā

(||ĕppu||)
addaliṁchevānivalĕ nābĕdone paligevu
vŏddigai nasadulĕlla vŏdda nuṁḍam̐gā
baddula baḍaligadom̐ baṭṭe vābĕgaidaṁḍa
kaddulerā nīvŏḽḽigabaḍā lĕram̐ganā

(||ĕppu||)
yĕgasakkīnivalĕne yībĕdone navvevu
sŏgasi toḍisadulu sūḍam̐gāne
agabaḍi kūḍidivi alamelumaṁga nenu
tagu śhrīveṁkaḍeśha nī tamaga mĕram̐ganā