ఎప్పుడు నీ వోజ లిఁక యేల మానేవు
(॥పల్లవి॥)
ఎప్పుడు నీ వోజ లిఁక యేల మానేవు
తప్పు లెంచ నీకు నిట్టే దయ్య మిచ్చెఁగా
(॥ఎప్పుడు॥)
వెట్టి జాగరాలు నీతో వేగినంతాఁ జేసి చేసి
అట్టే పవ్వళించితే నపరాధమా
తిట్టేవు నీ వప్పటిని దీని కింత గర్వమని
బట్టబయలాడుకొని పాలఁ బోయఁగా
(॥ఎప్పుడు॥)
దవ్వుల నీతో నవ్వి తనిసి యిన్నిటా నాపె
అవ్వలిమోమైనదే యపరాధమా
రవ్వగాఁ బగ చాదేవు రాజము చూపె నని
నెవ్వగలు గడియించ నీవు దేవరవుగా
(॥ఎప్పుడు॥)
కాయజ కేలిని నీకత వెల్లాఁ గని కని
ఆయములు గరఁగితే నపరాధమా
యీయెడ శ్రీవేంకటేశ యింతి నిట్టే కూడితివి
చాయల మెచ్చులు మెచ్చ స్వామివే కావా
(||pallavi||)
ĕppuḍu nī voja lim̐ka yela mānevu
tappu lĕṁcha nīgu niṭṭe dayya michchĕm̐gā
(||ĕppuḍu||)
vĕṭṭi jāgarālu nīdo veginaṁtām̐ jesi sesi
aṭṭe pavvaḽiṁchide nabarādhamā
tiṭṭevu nī vappaḍini dīni kiṁta garvamani
baṭṭabayalāḍugŏni pālam̐ boyam̐gā
(||ĕppuḍu||)
davvula nīdo navvi tanisi yinniḍā nābĕ
avvalimomainade yabarādhamā
ravvagām̐ baga sādevu rājamu sūbĕ nani
nĕvvagalu gaḍiyiṁcha nīvu devaravugā
(||ĕppuḍu||)
kāyaja kelini nīgada vĕllām̐ gani kani
āyamulu garam̐gide nabarādhamā
yīyĕḍa śhrīveṁkaḍeśha yiṁti niṭṭe kūḍidivi
sāyala mĕchchulu mĕchcha svāmive kāvā