Eppudu nee suddulu ne merimginave

ఎప్పుడు నీ సుద్దులు నే మెరిఁగినవే
Language

(॥పల్లవి॥)
ఎప్పుడు నీ సుద్దులు నే మెరిఁగినవే
కప్పురము గోవయ్య కత లెల్ల మాని

(॥ఎప్పడు॥)
నొస లెల్లఁ జెమరించి నున్నని చెక్కుల జారె
కిసరి యెవ్వతె యలిగెనో నీతోను
యిసుమంత వడె కాని యింతి నిన్నుఁ బాయ లేదు
విసరేము రావయ్య వేసాలు మాని

(॥ఎప్పడు॥)
సరు లెల్ల జిక్కువడి చల్లువెద లైన వివే
సిరుల నిన్నెం తాపె చేయి ముట్టెనో
సరస మింతే కాని చలము నీతోఁ గాదు
సరిసేసుకోవయ్య చలములు మాని

(॥ఎప్పడు॥)
నిట్టూరుపులు రేఁగె నిద్దుర కన్నులఁ దేరె
అట్టె యెవ్వతెరతి నలసితివో
నెట్టన శ్రీవెంకటేశ నేఁడు నన్నుఁ గూడితివి
పట్టపలమేల్‌మంగను పంత మెల్ల మాని

(||pallavi||)
ĕppuḍu nī suddulu ne mĕrim̐ginave
kappuramu govayya kada lĕlla māni

(||ĕppaḍu||)
nŏsa lĕllam̐ jĕmariṁchi nunnani sĕkkula jārĕ
kisari yĕvvadĕ yaligĕno nīdonu
yisumaṁta vaḍĕ kāni yiṁti ninnum̐ bāya ledu
visaremu rāvayya vesālu māni

(||ĕppaḍu||)
saru lĕlla jikkuvaḍi salluvĕda laina vive
sirula ninnĕṁ tābĕ seyi muṭṭĕno
sarasa miṁte kāni salamu nīdom̐ gādu
sarisesugovayya salamulu māni

(||ĕppaḍu||)
niṭṭūrubulu rem̐gĕ niddura kannulam̐ derĕ
aṭṭĕ yĕvvadĕradi nalasidivo
nĕṭṭana śhrīvĕṁkaḍeśha nem̐ḍu nannum̐ gūḍidivi
paṭṭabalamel‌maṁganu paṁta mĕlla māni