ఎప్పుడు మీకే పోదు యింతవలెనా
(॥పల్లవి॥)
ఎప్పుడు మీకే పోదు యింతవలెనా
కొప్పువట్టితే అప్పుడు కొంచెము గావలెనా
(॥ఎప్పు॥)
పలుకుల కొదదీరె పరాకు లిఁకనేలే
చెలువుఁడు చెప్పినట్టు నేయరాదా
నిలుచున్నాఁడిదె వచ్చి నిదుర నీ కింత యేలే
బలిమిఁ బట్టినమీఁద భ్రమయఁగవలెనా
(॥ఎప్పు॥)
మనసు కోపమువాసె మరి చింత లిఁకనేలే
ఘనునిప్రియములెల్లఁ గైకోరాదా
తనుఁదానె వీడెమిచ్చి తలవంచ నీకేలే
చెనకి చేయిచేసుకొంటే సిగ్గువడవలెనా
(॥ఎప్పు॥)
కాఁగిటిలో కొదదీరె కమ్మర జంకించనేలే
పీఁగక శ్రీవేంకటేశుఁ బిలువరాదా
రేఁగి యాతఁడు నవ్వీని రిచ్చలఁ గొంకఁగనేలే
మూఁగి యాతఁడు ముంచితే మొగమోట వలెనా
(||pallavi||)
ĕppuḍu mīge podu yiṁtavalĕnā
kŏppuvaṭṭide appuḍu kŏṁchĕmu gāvalĕnā
(||ĕppu||)
palugula kŏdadīrĕ parāgu lim̐kanele
sĕluvum̐ḍu sĕppinaṭṭu neyarādā
nilusunnām̐ḍidĕ vachchi nidura nī kiṁta yele
balimim̐ baṭṭinamīm̐da bhramayam̐gavalĕnā
(||ĕppu||)
manasu kobamuvāsĕ mari siṁta lim̐kanele
ghanunipriyamulĕllam̐ gaigorādā
tanum̐dānĕ vīḍĕmichchi talavaṁcha nīgele
sĕnagi seyisesugŏṁṭe sigguvaḍavalĕnā
(||ĕppu||)
kām̐giḍilo kŏdadīrĕ kammara jaṁkiṁchanele
pīm̐gaga śhrīveṁkaḍeśhum̐ biluvarādā
rem̐gi yādam̐ḍu navvīni richchalam̐ gŏṁkam̐ganele
mūm̐gi yādam̐ḍu muṁchide mŏgamoḍa valĕnā