Eppudu mannimchevayya imka neevu

ఎప్పుడు మన్నించేవయ్య ఇఁక నీవు
Language

(॥పల్లవి॥)
ఎప్పుడు మన్నించేవయ్య ఇఁక నీవు
వుప్పతిల్లు వేడుకెల్లా వొడిగట్టుకొన్నది

(॥॥)
జవ్వనమదముతోడ చన్నుల వేఁకముతోడ
నివ్వెరగుపడి చెలి నిలుచున్నది
నవ్వులు సెలవిఁగార నయము మోమున మీర
వువ్విళ్లూరుచు నీపై నొరగుకొనున్నది

(॥॥)
సిగ్గులనే విఱ్ఱవీఁగి చిప్పిలఁగ మోవి మాఁగి
వొగ్గి విడె మందుకొని వూరకున్నది
నిగ్గుఁబులక లెసఁగ నిట్టూర్పులు వొసఁగ
కగ్గుదేర నేకతానఁ గాఁగిలించుకొన్నుది

(॥॥)
పెనుఁ గొప్పు కడువీడ ప్రియాలు మాటలఁగూడ
గునియుచు నీతొడపైఁ గూచున్నది
యెనసితివి శ్రీ వెంకటేశ యీకెను మన్నించి
ననుపుల నిన్ను నిట్టె నమ్మివున్నది

(||pallavi||)
ĕppuḍu manniṁchevayya im̐ka nīvu
vuppadillu veḍugĕllā vŏḍigaṭṭugŏnnadi

(||||)
javvanamadamudoḍa sannula vem̐kamudoḍa
nivvĕragubaḍi sĕli nilusunnadi
navvulu sĕlavim̐gāra nayamu momuna mīra
vuvviḽlūrusu nībai nŏragugŏnunnadi

(||||)
siggulane viṭravīm̐gi sippilam̐ga movi mām̐gi
vŏggi viḍĕ maṁdugŏni vūragunnadi
niggum̐bulaga lĕsam̐ga niṭṭūrbulu vŏsam̐ga
kaggudera negadānam̐ gām̐giliṁchugŏnnudi

(||||)
pĕnum̐ gŏppu kaḍuvīḍa priyālu māḍalam̐gūḍa
guniyusu nīdŏḍabaim̐ gūsunnadi
yĕnasidivi śhrī vĕṁkaḍeśha yīgĕnu manniṁchi
nanubula ninnu niṭṭĕ nammivunnadi