ఎప్పుడు మంచిదాననె యిదివో నీకు నాతో
(॥పల్లవి॥)
ఎప్పుడు మంచిదాననె యిదివో నీకు నాతో
చెప్పవద్దు గాని నీకు సెల విచ్చేను నేనూ
(॥ఎప్పడు॥)
నిచ్చలూను నిజ మాడి నీకుఁ బగ యవుకంటే
రిచ్చల నూరకుండితే రేఁచ నే లయ్య
హెచ్చి నే నే మనినాను యీరు దియ్యఁ బేను వచ్చు
కుచ్చితము గాదు లొనఁ గూచుండే నేను
(॥ఎప్పడు॥)
కూరిమి నీవెంట వచ్చి గుండెదిగు లవుకంటే
బీరాన నే నీడ నుండేఁ బిల్వకు వయ్య
కేరడాన నట్టె గోర గీరితే నేరు లవును
నేర నంతేసి యిచ్చలు నిద్దిరించే నేనూ
(॥ఎప్పడు॥)
గక్కువ నీ మోవి యాని గంటు రాఁగించుకంటే
చిక్కి నీ వశాన నుండే చెనక కయ్యా
పక్కన శ్రీవెంకటేశ బలిమి నన్నుఁ గూడితి
వక్కర దీరినమీఁద నలయించ కయ్యా
(||pallavi||)
ĕppuḍu maṁchidānanĕ yidivo nīgu nādo
sĕppavaddu gāni nīgu sĕla vichchenu nenū
(||ĕppaḍu||)
nichchalūnu nija māḍi nīgum̐ baga yavugaṁṭe
richchala nūraguṁḍide rem̐sa ne layya
hĕchchi ne ne maninānu yīru diyyam̐ benu vachchu
kuchchidamu gādu lŏnam̐ gūsuṁḍe nenu
(||ĕppaḍu||)
kūrimi nīvĕṁṭa vachchi guṁḍĕdigu lavugaṁṭe
bīrāna ne nīḍa nuṁḍem̐ bilvagu vayya
keraḍāna naṭṭĕ gora gīride neru lavunu
nera naṁtesi yichchalu niddiriṁche nenū
(||ĕppaḍu||)
gakkuva nī movi yāni gaṁṭu rām̐giṁchugaṁṭe
sikki nī vaśhāna nuṁḍe sĕnaga kayyā
pakkana śhrīvĕṁkaḍeśha balimi nannum̐ gūḍidi
vakkara dīrinamīm̐da nalayiṁcha kayyā