Eppudu maanavu kobameme neevu

ఎప్పుడు మానవు కోపమేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎప్పుడు మానవు కోపమేమే నీవు
రెప్పలెత్తి చూచితేనే రేసు వుట్టీనా

(॥ఎప॥)
పుప్పొడి నీమీఁదఁ జల్లె పూవులచెండున వేసె
అప్పటి నాతఁడలిగెననే నదేమే
కప్పిన యీవేట్లకు కళదాఁకె నింతెకాక
చిప్పిలు నీమనసేమి చిల్లులాయనా

(॥ఎప॥)
పాదము నీపైఁ జూఁచె పట్టెమంచముపైఁ బండె
ఆదరించఁడాయ ననేవదేమే నీవు
సోదించి మేనంటఁగాను సొమ్ములొత్తె నింతెకాక
పాదుగా నీకాతఁడేమి పగ సేసెనా

(॥ఎప॥)
గక్కన నీచెక్కు నొక్కె కాఁగిటను బిగియించె
అక్కర దీరదనేవు అదేమే నీవు
యేక్కువతో శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁ గూడె
తక్కక నీ కింకానేమి తనివారదా

(||pallavi||)
ĕppuḍu mānavu kobameme nīvu
rĕppalĕtti sūsidene resu vuṭṭīnā

(||ĕba||)
puppŏḍi nīmīm̐dam̐ jallĕ pūvulasĕṁḍuna vesĕ
appaḍi nādam̐ḍaligĕnane nademe
kappina yīveṭlagu kaḽadām̐kĕ niṁtĕgāga
sippilu nīmanasemi sillulāyanā

(||ĕba||)
pādamu nībaim̐ jūm̐sĕ paṭṭĕmaṁchamubaim̐ baṁḍĕ
ādariṁcham̐ḍāya nanevademe nīvu
sodiṁchi menaṁṭam̐gānu sŏmmulŏttĕ niṁtĕgāga
pādugā nīgādam̐ḍemi paga sesĕnā

(||ĕba||)
gakkana nīsĕkku nŏkkĕ kām̐giḍanu bigiyiṁchĕ
akkara dīradanevu ademe nīvu
yekkuvado śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
takkaga nī kiṁkānemi tanivāradā