ఎప్పుడు కరుణఁ జూచే వీయింతిని
(॥పల్లవి॥)
ఎప్పుడు కరుణఁ జూచే వీయింతిని
కుప్పళించి మాఁటలనే కొసరీ నిన్నును
(॥ఎప్పు॥)
చిక్కనితేనెలు మోవిఁ జిప్పిలఁగాఁ జెలి నిన్ను
పెక్కు ప్రియములు చెప్పి పిలిచీ నిదె
మిక్కలి చెమటలెల్లా మేన నిట్టె తురుగగా
పిక్కటిల్ల రతులకుఁ బెనఁగీ నీతోను
(॥ఎప్పు॥)
తామెరలవాసనలు దట్టముగా దొలఁకఁగా
కోమలపుఁ జేతులఁ జెక్కు నొక్కి నిదె
కామించి కుచములల కాంతలు నీపైఁ గప్పఁగా
దీమసాన నొడివట్టి తీసీ నన్నింటికి
(॥ఎప్పు॥)
నంటున నవ్వు వెన్నెలనాము సెలవి నిండఁగా
అంటి చెవిలో నేకతమాడీ నిదె
జంటల శ్రీవేంకటేశ సమరతి సేసి నిన్ను
వొంటి నలపార్చి యిప్పు డొడఁబరచీని
(||pallavi||)
ĕppuḍu karuṇam̐ jūse vīyiṁtini
kuppaḽiṁchi mām̐ṭalane kŏsarī ninnunu
(||ĕppu||)
sikkanidenĕlu movim̐ jippilam̐gām̐ jĕli ninnu
pĕkku priyamulu sĕppi pilisī nidĕ
mikkali sĕmaḍalĕllā mena niṭṭĕ turugagā
pikkaḍilla radulagum̐ bĕnam̐gī nīdonu
(||ĕppu||)
tāmĕralavāsanalu daṭṭamugā dŏlam̐kam̐gā
komalabum̐ jedulam̐ jĕkku nŏkki nidĕ
kāmiṁchi kusamulala kāṁtalu nībaim̐ gappam̐gā
dīmasāna nŏḍivaṭṭi tīsī nanniṁṭigi
(||ĕppu||)
naṁṭuna navvu vĕnnĕlanāmu sĕlavi niṁḍam̐gā
aṁṭi sĕvilo negadamāḍī nidĕ
jaṁṭala śhrīveṁkaḍeśha samaradi sesi ninnu
vŏṁṭi nalabārsi yippu ḍŏḍam̐barasīni