Eppudu goodevoyamtaa nedurusoosee neegu

ఎప్పుడు గూడేవోయంటా నెదురుచూచీ నీకు
Language

(॥పల్లవి॥)
ఎప్పుడు గూడేవోయంటా నెదురుచూచీ నీకు
ఇప్పుడే మా విన్నపాలు ఇయ్యకొనవయ్యా

(॥ఎప॥)
మనసు లక్కవంటిది సదము పొంగువంటిది
ననిచినయాసలు నామువంటిది
పెన్నగొన్నకోరిక పెనుజిగురువంటిది
వనిత నీకు మేలుది వద్దికి రావయ్యా

(॥ఎప॥)
వలపు వలవంటిది వయ సామనివంటిది
తిలకించేచూపు తరితీపువంటిది
చెలిమి సేయఁజేయఁగ చేనిపంటవంటిది
చెలి నీపై బత్తి గద్దు చిత్తగించవయ్యా

(॥ఎప॥)
చింత లాభమువంటిది సిగ్గు చెలమవంటిది
బంతినుండియాడేమాట పైఁడివంటిది
పంతపుటలమేల్మంగపతివి శ్రీవేంకటేశ
యింతిఁ గూడితివి నేఁడు ఇట్టె మన్నించవయ్యా

(||pallavi||)
ĕppuḍu gūḍevoyaṁṭā nĕdurusūsī nīgu
ippuḍe mā vinnabālu iyyagŏnavayyā

(||ĕba||)
manasu lakkavaṁṭidi sadamu pŏṁguvaṁṭidi
nanisinayāsalu nāmuvaṁṭidi
pĕnnagŏnnagoriga pĕnujiguruvaṁṭidi
vanida nīgu meludi vaddigi rāvayyā

(||ĕba||)
valabu valavaṁṭidi vaya sāmanivaṁṭidi
tilagiṁchesūbu taridībuvaṁṭidi
sĕlimi seyam̐jeyam̐ga senibaṁṭavaṁṭidi
sĕli nībai batti gaddu sittagiṁchavayyā

(||ĕba||)
siṁta lābhamuvaṁṭidi siggu sĕlamavaṁṭidi
baṁtinuṁḍiyāḍemāḍa paim̐ḍivaṁṭidi
paṁtabuḍalamelmaṁgabadivi śhrīveṁkaḍeśha
yiṁtim̐ gūḍidivi nem̐ḍu iṭṭĕ manniṁchavayyā