Eppudu garunimchevu yemayyaa neevu

ఎప్పుడు గరుణించేవు యేమయ్యా నీవు
Language

(॥పల్లవి॥)
ఎప్పుడు గరుణించేవు యేమయ్యా నీవు
చెప్పరాని వినయాలచే నిన్ను మెప్పించెను

(॥ఎప్ప॥)
చెక్కులవెంటఁ గారే చెమటలతోడనే
పక్కన నిందాఁకా జెలి పాదాలొతైను
ముక్కున నిట్టూరుపులు ముంచి బుసకొట్టఁగానే
అక్కరతోఁ గొంతవడి యాలవట్ట మిడెను

(॥ఎప్ప॥)
గుబ్బలపై రాలేటి కుంకుమ బేంట్లతోనే
వుబ్బునఁ జేసెను నీకు నూడిగా లెల్లా
గుబ్బతిలు విరులతో కొప్ప గొంత జారఁగానే
నిబ్బరాన సారె సారె నిన్నుఁ జూచి మొక్కెను

(॥ఎప్ప॥)
పెదవులపై నూరే పిచ్చిలు తేనెలతనే
పదిమారులును విన్నపము సేసెను
యెదుట శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
అదివో తమ్ములను ని న్నప్పటి నడిగెను

(||pallavi||)
ĕppuḍu garuṇiṁchevu yemayyā nīvu
sĕpparāni vinayālase ninnu mĕppiṁchĕnu

(||ĕppa||)
sĕkkulavĕṁṭam̐ gāre sĕmaḍaladoḍane
pakkana niṁdām̐kā jĕli pādālŏdainu
mukkuna niṭṭūrubulu muṁchi busagŏṭṭam̐gāne
akkaradom̐ gŏṁtavaḍi yālavaṭṭa miḍĕnu

(||ĕppa||)
gubbalabai rāleḍi kuṁkuma beṁṭladone
vubbunam̐ jesĕnu nīgu nūḍigā lĕllā
gubbadilu virulado kŏppa gŏṁta jāram̐gāne
nibbarāna sārĕ sārĕ ninnum̐ jūsi mŏkkĕnu

(||ĕppa||)
pĕdavulabai nūre pichchilu tenĕladane
padimārulunu vinnabamu sesĕnu
yĕduḍa śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
adivo tammulanu ni nnappaḍi naḍigĕnu