ఎప్పుడు దయఁ జూచేవో యేమని విన్నవింతుము
(॥పల్లవి॥)
ఎప్పుడు దయఁ జూచేవో యేమని విన్నవింతుము
దప్పిదేరే మోవితోడఁ దలపోయుచున్నది
(॥॥)
వీడెమిచ్చే నంటా వచ్చి వెలఁది పానుపుమీఁద
పాడుకొంటా నున్నది నీపదము లెల్లా
గోడపై నీరూపము కోరి చిత్తరువుగాను
వేడుకతో వ్రాసుకొంటా వేగించుక వున్నది
(॥॥)
యేచీ నీపొందులు సేయ నిటు వచ్చి పెట్టెలలోఁ
జూచుకొంటా నున్నది నీసొమ్ములెల్లాను
ఆచాయ కెడతాఁకే నీయవసరపు గాంతల
లాచుక నీసుద్దులే యాలకింపుచు నున్నది
(॥॥)
సేవ సేసే నంటా వచ్చి చిత్తములో చెక్కుచేత
భావించుకొంటా నున్నది పనులెల్లాను
శ్రీవేంకటేశ నీవే విచ్చేసి యలమేల్మంగను
తావుకొనఁ గూడితివి తతి నలశున్నది
(||pallavi||)
ĕppuḍu dayam̐ jūsevo yemani vinnaviṁtumu
dappidere movidoḍam̐ dalaboyusunnadi
(||||)
vīḍĕmichche naṁṭā vachchi vĕlam̐di pānubumīm̐da
pāḍugŏṁṭā nunnadi nībadamu lĕllā
goḍabai nīrūbamu kori sittaruvugānu
veḍugado vrāsugŏṁṭā vegiṁchuga vunnadi
(||||)
yesī nībŏṁdulu seya niḍu vachchi pĕṭṭĕlalom̐
jūsugŏṁṭā nunnadi nīsŏmmulĕllānu
āsāya kĕḍadām̐ke nīyavasarabu gāṁtala
lāsuga nīsuddule yālagiṁpusu nunnadi
(||||)
seva sese naṁṭā vachchi sittamulo sĕkkuseda
bhāviṁchugŏṁṭā nunnadi panulĕllānu
śhrīveṁkaḍeśha nīve vichchesi yalamelmaṁganu
tāvugŏnam̐ gūḍidivi tadi nalaśhunnadi