ఎప్పుడు దయదలఁచే వింక నీవు
(॥పల్లవి॥)
ఎప్పుడు దయదలఁచే వింక నీవు
దప్పిదేర మోవి యిచ్చి దక్కఁగొనవయ్యా
(॥ఎప్పు॥)
నిలువెల్లఁ జెమరించె నీతో మాటాడరాఁగా
వెలఁదియలపుదీర విసరవయ్యా
నెలవై కొలువుసేసి నివ్వెరగుతో నున్నది
యెలమి నీతోడమీఁద నిడుకొనవయ్యా
(॥ఎప్పు॥)
భారపుతురుము జారె పాదాలకు మొక్కరాఁగా
నేరుపున ముడిచి మన్నించవయ్యా
తేరకొన నిన్నుఁజూచి తిమురుచునున్నది
గారవించి కాఁగిటను కాఁగిలించవయ్యా
(॥ఎప్పు॥)
వెసఁ బోఁకముడి వీడె వీడెము చేతికిరాఁగా
పసగాను తెరవేసి పాలించవయ్యా
కొసరి శ్రీవేంకటేశ కూడె నిన్ను నింతలోనె
సుసరాన రతులకు జొక్కి మెచ్చవయ్యా
(||pallavi||)
ĕppuḍu dayadalam̐se viṁka nīvu
dappidera movi yichchi dakkam̐gŏnavayyā
(||ĕppu||)
niluvĕllam̐ jĕmariṁchĕ nīdo māḍāḍarām̐gā
vĕlam̐diyalabudīra visaravayyā
nĕlavai kŏluvusesi nivvĕragudo nunnadi
yĕlami nīdoḍamīm̐da niḍugŏnavayyā
(||ĕppu||)
bhārabudurumu jārĕ pādālagu mŏkkarām̐gā
nerubuna muḍisi manniṁchavayyā
teragŏna ninnum̐jūsi timurusununnadi
gāraviṁchi kām̐giḍanu kām̐giliṁchavayyā
(||ĕppu||)
vĕsam̐ bom̐kamuḍi vīḍĕ vīḍĕmu sedigirām̐gā
pasagānu tĕravesi pāliṁchavayyā
kŏsari śhrīveṁkaḍeśha kūḍĕ ninnu niṁtalonĕ
susarāna radulagu jŏkki mĕchchavayyā