ఎప్పుడు దలఁచే వీకెపై నీవు
(॥పల్లవి॥)
ఎప్పుడు దలఁచే వీకెపై నీవు
అప్పుడే కూడఁగవద్దా అయ్యో నీవు
(॥॥)
అక్కరతో నాసపడి అట్టె మోము చూచేచెలిఁ
జెక్కు నొక్కవైతివిగా చెల్లఁబో నీవు
మక్కళించి వీనుల నీమాట లాలకించేదాని
గక్కనఁ బిలువవద్దా కటకటా నీవు
(॥॥)
సెలవుల నవ్వుదేర చెంగలించి మొక్కేసతి
అలమి మెచ్చఁగవద్దా ఆహా నీవు
కొలువుసేయుచు నిన్నుఁ గూరిమి గొసరేదాని
అలరి లాలించవద్దా అవునయ్యా నీవు
(॥॥)
నిండు జవ్వనముతోడ నిన్నుఁ గోరుచున్న యింతి-
నండఁ బెట్టుకొనవద్దాఁ సమ్మరో నీవు
దండిగా శ్రీ వేంకటేశ తగ నిన్నుఁగూడె నిట్టె
పఁ(పం)డు మోవి యియ్యవద్దా బాపురే నీవు
(||pallavi||)
ĕppuḍu dalam̐se vīgĕbai nīvu
appuḍe kūḍam̐gavaddā ayyo nīvu
(||||)
akkarado nāsabaḍi aṭṭĕ momu sūsesĕlim̐
jĕkku nŏkkavaidivigā sĕllam̐bo nīvu
makkaḽiṁchi vīnula nīmāḍa lālagiṁchedāni
gakkanam̐ biluvavaddā kaḍagaḍā nīvu
(||||)
sĕlavula navvudera sĕṁgaliṁchi mŏkkesadi
alami mĕchcham̐gavaddā āhā nīvu
kŏluvuseyusu ninnum̐ gūrimi gŏsaredāni
alari lāliṁchavaddā avunayyā nīvu
(||||)
niṁḍu javvanamudoḍa ninnum̐ gorusunna yiṁti-
naṁḍam̐ bĕṭṭugŏnavaddām̐ sammaro nīvu
daṁḍigā śhrī veṁkaḍeśha taga ninnum̐gūḍĕ niṭṭĕ
pam̐(paṁ)ḍu movi yiyyavaddā bābure nīvu