ఎప్పుడు భేదము లేదు ఇద్దరికిని
(॥పల్లవి॥)
ఎప్పుడు భేదము లేదు ఇద్దరికిని
చప్పుడు సేయకుండితే చనవిచ్చీ నతఁడు
(॥॥)
పెలుచైనవానికిఁ బ్రియములు చెప్పితేను
కలుచపడుఁ గాక సంగతెరుఁగునా
తలఁచుకొనీఁ దానే తరి నాకిచ్చినబాస
మలసి వూరకుండితే మంకుదేరీ నతఁడు
(॥॥)
గడుసైనవానికిఁ గానుక లిచ్చితేను
బెడసరమే కాక వొడఁబడీనా
తడవీఁ గాక తానే తగిననాసేవలు
బడివాయకుండితేను పంతమిచ్చీ నతఁడు
(॥॥)
నాలియైనవానికి నవ్వులు నవ్వితేను
పేలరితనమే కాక పెంపురుఁగునా
వేళెరిఁగి తా నన్ను శ్రీవేంకటేశుఁడిటు గూడె
తాలిమితో నుండితేను దయఁజూచీ నతఁడు
(||pallavi||)
ĕppuḍu bhedamu ledu iddarigini
sappuḍu seyaguṁḍide sanavichchī nadam̐ḍu
(||||)
pĕlusainavānigim̐ briyamulu sĕppidenu
kalusabaḍum̐ gāga saṁgadĕrum̐gunā
talam̐sugŏnīm̐ dāne tari nāgichchinabāsa
malasi vūraguṁḍide maṁkuderī nadam̐ḍu
(||||)
gaḍusainavānigim̐ gānuga lichchidenu
bĕḍasarame kāga vŏḍam̐baḍīnā
taḍavīm̐ gāga tāne taginanāsevalu
baḍivāyaguṁḍidenu paṁtamichchī nadam̐ḍu
(||||)
nāliyainavānigi navvulu navvidenu
pelaridaname kāga pĕṁpurum̐gunā
veḽĕrim̐gi tā nannu śhrīveṁkaḍeśhum̐ḍiḍu gūḍĕ
tālimido nuṁḍidenu dayam̐jūsī nadam̐ḍu