Eppudoonu neegum bodu yedayaraadu

ఎప్పుడూను నీకుఁ బోదు యెడయరాదు
Language

(॥పల్లవి॥)
ఎప్పుడూను నీకుఁ బోదు యెడయరాదు
కప్పనేల తమకము కరుణించవయ్యా

(॥ఎప్పు॥)
వలపు నిలువలేక వనిత పాడీఁ బాట
వెలలేనివేడుకతో వినవయ్య
కలది తెరమరఁగు కందువఁ బొట్టఁబొరుగు
చెలిమి యన్నాళ్ళనుండో చిత్తగించవయ్యా

(॥ఎప్పు॥)
మూసి మంతనాలు మాని ముచ్చటఁ బూవుల వేసి
ఆసల దిష్టించి చూచి నలరవయ్య
సేసలు చేతిలోనివి చింతలు పనిలేనివి
పోసరించి మీవావులు పొందు చూపరయ్యా

(॥ఎప్పు॥)
ముందే సిగ్గు మూటగట్టి మోము చూచి నవ్వు నవ్వు
యిందునే రతుల నిట్టె యేలవయ్య
చెందితి రిద్దరు నేఁడు శ్రీవేంకటేశుఁడ
చందమాయ మీచేఁతలు చన వియ్యవయ్యా

(||pallavi||)
ĕppuḍūnu nīgum̐ bodu yĕḍayarādu
kappanela tamagamu karuṇiṁchavayyā

(||ĕppu||)
valabu niluvalega vanida pāḍīm̐ bāḍa
vĕlaleniveḍugado vinavayya
kaladi tĕramaram̐gu kaṁduvam̐ bŏṭṭam̐bŏrugu
sĕlimi yannāḽḽanuṁḍo sittagiṁchavayyā

(||ĕppu||)
mūsi maṁtanālu māni muchchaḍam̐ būvula vesi
āsala diṣhṭiṁchi sūsi nalaravayya
sesalu sedilonivi siṁtalu panilenivi
posariṁchi mīvāvulu pŏṁdu sūbarayyā

(||ĕppu||)
muṁde siggu mūḍagaṭṭi momu sūsi navvu navvu
yiṁdune radula niṭṭĕ yelavayya
sĕṁdidi riddaru nem̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍa
saṁdamāya mīsem̐talu sana viyyavayyā