ఎప్పుడూను నడచేవె యేకాలమైనాను
(॥పల్లవి॥)
ఎప్పుడూను నడచేవె యేకాలమైనాను
కప్పి నిష్ఠూరమేల కట్టేరయ్యా
(॥ఎప్పు॥)
శ్రీపతి యాణాజ్ఞచేతఁ జిక్కనది జగము
యేపున మా యాణాజ్ఞ లేఁటివయ్య
కోపగించుకొనుటింతే కొంకక లోకాలు నేము
మాపుదాఁకా మానుమంటే మానఁబొయ్యీనా
(॥ఎప్పు॥)
నరహరి రక్షణమే నడచీని లోకము
యిరవై నేము రక్షించే దేఁటిదయ్య
పొరలే గర్వ మింతె బూతులసంసారము
మరలి నేమూరకుంటే మానఁబొయ్యీనా
(॥ఎప్పు॥)
సృష్టికిఁ గుర్తైనవాఁడు శ్రీవేంకటేశుఁ డింతే
యిష్టానిష్టము మాకు నేఁటిదయ్య
నష్టి లేదు నడచేది నడవక మానరాదు
తష్టి గట్టుకొంటిఁగాక తా మానఁబొయ్యీనా
(||pallavi||)
ĕppuḍūnu naḍasevĕ yegālamainānu
kappi niṣhṭhūramela kaṭṭerayyā
(||ĕppu||)
śhrībadi yāṇājñasedam̐ jikkanadi jagamu
yebuna mā yāṇājña lem̐ṭivayya
kobagiṁchugŏnuḍiṁte kŏṁkaga logālu nemu
mābudām̐kā mānumaṁṭe mānam̐bŏyyīnā
(||ĕppu||)
narahari rakṣhaṇame naḍasīni logamu
yiravai nemu rakṣhiṁche dem̐ṭidayya
pŏrale garva miṁtĕ būdulasaṁsāramu
marali nemūraguṁṭe mānam̐bŏyyīnā
(||ĕppu||)
sṛṣhṭigim̐ gurdainavām̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍiṁte
yiṣhṭāniṣhṭamu māgu nem̐ṭidayya
naṣhṭi ledu naḍasedi naḍavaga mānarādu
taṣhṭi gaṭṭugŏṁṭim̐gāga tā mānam̐bŏyyīnā