ఎప్పుడూఁ దనవారమే యేడనున్నాను
(॥పల్లవి॥)
ఎప్పుడూఁ దనవారమే యేడనున్నాను
వొప్పాయి వలపు లూరకుండుమనఁ గదవే
(॥ఎప్పు॥)
సరసములాడఁబేతే సరి నలపులు చిక్కు
కరకరించఁగఁబోతే కాఁకలు రేఁగు
తెర దియ్యఁగబోతే తరితీపులే కడుమించు
వొరయనేఁటికి వూరకుండు మనఁగదవే
(॥ఎప్పు॥)
చలము సాదించఁబోతే చండితనములు వుట్టు
బలిమి చూపఁగఁబోతే పంతాలు హెచ్చు
గిలిగించఁబోతేను గీరలు వొళ్లెల్లా నిండు
వులివచ్చి సేయకూరకుండుమనఁగదవే
(॥ఎప్పు॥)
బట్టబయలీఁదించఁబోతే భావము చిక్కులువడు
గుట్టులు చూపఁగఁబోతే కుప్పలౌఁదమి
ఇట్టె శ్రీవేంకటేశుఁడింతలోనే నన్నుఁ గూడె
వొట్టు చెల్లె నిఁక నూరకుండుమనఁగదవే
(||pallavi||)
ĕppuḍūm̐ danavārame yeḍanunnānu
vŏppāyi valabu lūraguṁḍumanam̐ gadave
(||ĕppu||)
sarasamulāḍam̐bede sari nalabulu sikku
karagariṁcham̐gam̐bode kām̐kalu rem̐gu
tĕra diyyam̐gabode taridībule kaḍumiṁchu
vŏrayanem̐ṭigi vūraguṁḍu manam̐gadave
(||ĕppu||)
salamu sādiṁcham̐bode saṁḍidanamulu vuṭṭu
balimi sūbam̐gam̐bode paṁtālu hĕchchu
giligiṁcham̐bodenu gīralu vŏḽlĕllā niṁḍu
vulivachchi seyagūraguṁḍumanam̐gadave
(||ĕppu||)
baṭṭabayalīm̐diṁcham̐bode bhāvamu sikkuluvaḍu
guṭṭulu sūbam̐gam̐bode kuppalaum̐dami
iṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍiṁtalone nannum̐ gūḍĕ
vŏṭṭu sĕllĕ nim̐ka nūraguṁḍumanam̐gadave