ఎప్పుడూ నీయాల నేను ఇటు నాకు మగఁడవు
(॥పల్లవి॥)
ఎప్పుడూ నీయాల నేను ఇటు నాకు మగఁడవు
చిప్పిల నాచేత నీవు సేవగొనవయ్యా
(॥॥)
కన్నెనాటనుండి నాకుఁ గాచుకుండి యింతేసి-
చన్నులు రాఁగాను సేవవెట్టితివి
విన్నవించే దేమున్నది వేగినంతా నీవు నన్ను
మన్నించిన మన్ననలు మఱవకుమయ్యా
(॥॥)
మొలక వలపులే మొదలుసేసుకొని
తొలిసమరుతాడితే దొరసితివి
బలిమి చెప్పఁగనేల పలుమారు నీవు నాకు-
నెలమి నిచ్చినమాఁట యీడేరించవయ్యా
(॥॥)
తమకపుఁ జూపులనే దక్కి నాకాఁగిటిలోన
కొమరెపాయ మీడేరఁ గూడితివి
అమర నాడఁగనేల ఆసతో శ్రీవేంకటేశ
జమళి నావద్దనుండి చనవియ్యవయ్యా
(||pallavi||)
ĕppuḍū nīyāla nenu iḍu nāgu magam̐ḍavu
sippila nāseda nīvu sevagŏnavayyā
(||||)
kannĕnāḍanuṁḍi nāgum̐ gāsuguṁḍi yiṁtesi-
sannulu rām̐gānu sevavĕṭṭidivi
vinnaviṁche demunnadi veginaṁtā nīvu nannu
manniṁchina mannanalu maṟavagumayyā
(||||)
mŏlaga valabule mŏdalusesugŏni
tŏlisamarudāḍide dŏrasidivi
balimi sĕppam̐ganela palumāru nīvu nāgu-
nĕlami nichchinamām̐ṭa yīḍeriṁchavayyā
(||||)
tamagabum̐ jūbulane dakki nāgām̐giḍilona
kŏmarĕbāya mīḍeram̐ gūḍidivi
amara nāḍam̐ganela āsado śhrīveṁkaḍeśha
jamaḽi nāvaddanuṁḍi sanaviyyavayyā