Eppudoo nee voja maanaveraa vori

ఎప్పుడూ నీ వోజ మానవేరా వోరి
Language

(॥పల్లవి॥)
ఎప్పుడూ నీ వోజ మానవేరా వోరి
చొప్పుగా నావలె నిన్నుఁ జూచుకోఁ గదవే

(॥ఎప॥)
అంగవించి నే నీతోనాడినట్టల్లా నీవు
యెంగిలిమాటలాడేవు యేరా వోరి
సంగ తెరఁగ వదేమే సారెసారె నీనోటఁ
నెంగిలి గాకుండా మాట యెట్లనాడేవే

(॥ఎప॥)
మొదలనే గుట్టుతోడ మొక్కులు మొక్కితే నీవు
యెదురు మొక్కులు మొక్కేవేరా వోరి
పదరి నేనే నీకు పంతమిచ్చి మొక్కితేను
యెదురు మొక్కు మొక్కక యెట్లనుండేవే

(॥ఎప॥)
వంతుకు నందరివలె వద్ద నేఁ గూచుండితేను
యింతలోఁ గాఁగిలించేవు యేరా వోరి
బంతినే శ్రీవేంకటాద్రిపతి నే నండనుండఁగఁ
నెంతైనాఁ గాఁగిలీక యెట్లనుండేవే

(||pallavi||)
ĕppuḍū nī voja mānaverā vori
sŏppugā nāvalĕ ninnum̐ jūsugom̐ gadave

(||ĕba||)
aṁgaviṁchi ne nīdonāḍinaṭṭallā nīvu
yĕṁgilimāḍalāḍevu yerā vori
saṁga tĕram̐ga vademe sārĕsārĕ nīnoḍam̐
nĕṁgili gāguṁḍā māḍa yĕṭlanāḍeve

(||ĕba||)
mŏdalane guṭṭudoḍa mŏkkulu mŏkkide nīvu
yĕduru mŏkkulu mŏkkeverā vori
padari nene nīgu paṁtamichchi mŏkkidenu
yĕduru mŏkku mŏkkaga yĕṭlanuṁḍeve

(||ĕba||)
vaṁtugu naṁdarivalĕ vadda nem̐ gūsuṁḍidenu
yiṁtalom̐ gām̐giliṁchevu yerā vori
baṁtine śhrīveṁkaḍādribadi ne naṁḍanuṁḍam̐gam̐
nĕṁtainām̐ gām̐gilīga yĕṭlanuṁḍeve