ఎప్పుడూ నీ కాఁగిటఁ బాయక యిట్టె వుండునమ్మా
(॥పల్లవి॥)
ఎప్పుడూ నీ కాఁగిటఁ బాయక యిట్టె వుండునమ్మా
తప్పక యింతేసి నీతోఁ దారుకాణించనేలే
(॥ఎప్పు॥)
చందమామవంటిమోము సతి నీకుఁ గలుగఁగా
విందువలెఁ జిరునవ్వు వెన్నెల మించె
కందువతోఁ బదారుగళలు దొలఁకఁజొచ్చె
అంది వలచి నీ మగఁ డంట కెట్లుండునే
(॥ఎప్పు॥)
మెఱుఁగుఁదీగెవంటి మేమను నీకుఁ గలుగఁగా
గుఱిగా మేఘమువంటి కొప్పు వెలసె
మఱియు మోవిపండు మాఁగి తెనేగారీని
మఱఁగులేక నీ పతి మన్నించ కెట్లుండునే
(॥ఎప్పు॥)
నిమ్మపండ్లవంటినీచన్నులు గలుగఁగా
కమ్మి జవ్వనవనము కడు నమరె
వుమ్మడిఁ జెమటవాన లూరి పోదిసేసీ నిదె
యిమ్ముల శ్రీవేంకటేశుఁ డెనయ కెట్లుండునే
(||pallavi||)
ĕppuḍū nī kām̐giḍam̐ bāyaga yiṭṭĕ vuṁḍunammā
tappaga yiṁtesi nīdom̐ dārugāṇiṁchanele
(||ĕppu||)
saṁdamāmavaṁṭimomu sadi nīgum̐ galugam̐gā
viṁduvalĕm̐ jirunavvu vĕnnĕla miṁchĕ
kaṁduvadom̐ badārugaḽalu dŏlam̐kam̐jŏchchĕ
aṁdi valasi nī magam̐ ḍaṁṭa kĕṭluṁḍune
(||ĕppu||)
mĕṟum̐gum̐dīgĕvaṁṭi memanu nīgum̐ galugam̐gā
guṟigā meghamuvaṁṭi kŏppu vĕlasĕ
maṟiyu movibaṁḍu mām̐gi tĕnegārīni
maṟam̐gulega nī padi manniṁcha kĕṭluṁḍune
(||ĕppu||)
nimmabaṁḍlavaṁṭinīsannulu galugam̐gā
kammi javvanavanamu kaḍu namarĕ
vummaḍim̐ jĕmaḍavāna lūri podisesī nidĕ
yimmula śhrīveṁkaḍeśhum̐ ḍĕnaya kĕṭluṁḍune