ఎప్పుడూ నావాఁడవే యెంత వొడఁబరచేవు
(॥పల్లవి॥)
ఎప్పుడూ నావాఁడవే యెంత వొడఁబరచేవు
తప్పు లేదు నీవల్ల తగవు నీచేతిది
(॥ఎప్పు॥)
వాసి గలుగఁగ నావద్దనే వుండేననుచు
ఆసలేల చూపేవు అందుకేమయ్యా
బాస నీవెవ్వతెకైనాఁ బరగనిచ్చితేఁ బాయ
దోసము నీవెఱఁగవా తోయరాదు కాంతల
(॥ఎప్పు॥)
నంటున నెంతైనా నీవు నామాట దోయనని
అంటి నన్ను బుజ్జగించే వందుకేమయ్యా
జంటతోడఁ బెండ్లాడినసతు లింట నుండఁగా
వొంటి వేగించరాదు వూరడించువారిని
(॥ఎప్పు॥)
దిట్టవై శ్రీవెంకటేశ దేవుళ్ళలోనెల్లానీడ
అట్టె నన్నుఁ గూడితివి అందుకేమయ్యా
కట్టుకొన్న కాఁపురపుకామినుల నేలవలె
గుట్టునఁ దొలఁగరాదు కూడితే నేమాయను
(||pallavi||)
ĕppuḍū nāvām̐ḍave yĕṁta vŏḍam̐barasevu
tappu ledu nīvalla tagavu nīsedidi
(||ĕppu||)
vāsi galugam̐ga nāvaddane vuṁḍenanusu
āsalela sūbevu aṁdugemayyā
bāsa nīvĕvvadĕgainām̐ baraganichchidem̐ bāya
dosamu nīvĕṟam̐gavā toyarādu kāṁtala
(||ĕppu||)
naṁṭuna nĕṁtainā nīvu nāmāḍa doyanani
aṁṭi nannu bujjagiṁche vaṁdugemayyā
jaṁṭadoḍam̐ bĕṁḍlāḍinasadu liṁṭa nuṁḍam̐gā
vŏṁṭi vegiṁcharādu vūraḍiṁchuvārini
(||ĕppu||)
diṭṭavai śhrīvĕṁkaḍeśha devuḽḽalonĕllānīḍa
aṭṭĕ nannum̐ gūḍidivi aṁdugemayyā
kaṭṭugŏnna kām̐purabugāminula nelavalĕ
guṭṭunam̐ dŏlam̐garādu kūḍide nemāyanu