Eppudoo naabhaavamu neeveṟimginavaadavu

ఎప్పుడూ నాభావము నీవెఱిఁగినవాడవు
Language

(॥పల్లవి॥)
ఎప్పుడూ నాభావము నీవెఱిఁగినవాడవు
తప్పులెంచ కిట్లానే దయఁ జూడుమీ

(॥ఎప్పు॥)
చక్కనినీరూపు చూచి చొక్కివున్నదాన నేను
పక్కన నీవే నన్నుఁ బైకొనుమీ
యిక్కువ నే నంటనంటా యెగ్గువట్టేవు గనక
చిక్కని చన్నులమీఁదఁ జేయివేయుమీ

(॥ఎప్పు॥)
మాటలు నీ వాడఁగాను మత్తురాలనై వుందాన
గాఁటపునీపచ్చడము గప్పుమీ నాపై
కూటమిలోఁ బరాకంటా గుంపించేవుగనక
నాఁటుకొనంగా నీవే నన్నుఁ గాఁగిలించుమీ

(॥ఎప్పు॥)
సమరతి నిన్నుఁ గూడి సదమదమైనదాన
తమకాన మోవి ఇచ్చి దప్పిదీర్చుమీ
అమరె శ్రీవేంకటేశ అదేమనేవుగనక
సముకమిచ్చి యేపొద్దూ చనవరిఁ జేయుమీ

(||pallavi||)
ĕppuḍū nābhāvamu nīvĕṟim̐ginavāḍavu
tappulĕṁcha kiṭlāne dayam̐ jūḍumī

(||ĕppu||)
sakkaninīrūbu sūsi sŏkkivunnadāna nenu
pakkana nīve nannum̐ baigŏnumī
yikkuva ne naṁṭanaṁṭā yĕgguvaṭṭevu ganaga
sikkani sannulamīm̐dam̐ jeyiveyumī

(||ĕppu||)
māḍalu nī vāḍam̐gānu matturālanai vuṁdāna
gām̐ṭabunībachchaḍamu gappumī nābai
kūḍamilom̐ barāgaṁṭā guṁpiṁchevuganaga
nām̐ṭugŏnaṁgā nīve nannum̐ gām̐giliṁchumī

(||ĕppu||)
samaradi ninnum̐ gūḍi sadamadamainadāna
tamagāna movi ichchi dappidīrsumī
amarĕ śhrīveṁkaḍeśha ademanevuganaga
samugamichchi yebŏddū sanavarim̐ jeyumī